Goat leg curry : ఈ చలికాలంలో చాలామందికి జలుబులు, దగ్గు, లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటి జలుబులు డబ్బులు తగ్గడానికి మేక కాళ్ళ పులుసు చేసుకొని ఒక్కసారి తిన్నారంటే జలుబు ఇక పారిపోవాల్సిందే…ఈ మేక కాళ్ల కూరకి కావాల్సిన పదార్థాలు:మేక కాళ్లు, పసుపు, కారం, ఉప్పు , గరం మసాల ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కాయలు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు, గసగసాలు ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొత్తిమీర, చింతపండు రసం, మొదలైనవి..
దీని తయారీ విధానం: ముందుగా మేక కాలనీ తీసుకొని శుభ్రం చేసుకొని ఒక కుక్కర్లో వాటిని వేసి దాంట్లో రెండు స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రెండు స్పూన్ల అల్లం పేస్ట్, రెండు గ్లాసుల ఆయిల్ పోసి నాలుగు కప్పుల నీటిని వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. తర్వాత గసగసాలు ఒక నాలుగు స్పూన్లు తీసుకుని వాటిని వేయించుకొని ఒక కొబ్బరి ముక్కను కాల్చి దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని గసగసాలు కొబ్బరి రెండిటిని మిక్సీ జార్లో వేసి వాటర్ పోసి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెను స్టౌ పై పెట్టి దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి దాన్లో ఒక కప్పు ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి.
దాంట్లో తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ,కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని ముందుగా ఉడకబెట్టిన కాళ్లలో ఉన్న నీటిని దీంట్లో వేసుకోవాలి. ఇక తర్వాత దానిలో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి మసలు కాగనివ్వాలి. తర్వాత ఆ కాళ్ళను కూడా అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి దంచి ఈ కొడుకుతున్న కూరలో వేయాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గసగసాల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుతూ మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక తర్వాత మూత తీసి పులుసు దగ్గరికి అయిన తర్వాత దానిలో కొత్తిమీర వేసి దింపి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా మేక కాళ్ళ కూర రెడీ.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.