24 marriages : ఇంకొక్క పెళ్లయితే సిల్వర్ జూబ్లీనే.. 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్న నయవంచకుడు
24 marriages : కలియుగంలో మోసాలు చేసే వారు ఎక్కువ అవుతారని వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో రాశారట. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.కలియుగంలో అధర్మం చేసేవారు ఎక్కువగా ఉంటారని.. అసత్యం, అ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని ముందే హెచ్చరించారట.. వీరు చెప్పినట్టుగానే ప్రస్తుత సమాజంలో కూడా అదే జరుగుతోంది. ఎక్కడ చూసినా మోసాలు, అబద్ధాలు, నమ్మించి వంచన చేయడం వంటి ఘటనలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి.డబ్బు మనిషితో ఎలాంటి అధర్మానికైనా ఒడిగట్టేందుకు, అసత్యం చెప్పించానికి ప్రేరేపిస్తుంది. నేటి సమాజంలో నీతిగా, ధర్మంగా బతికేవారు చాలా తక్కువ.
అలాంటి వారు భూతద్దంలో వెతికినా కనిపించరు. ఎందుకంటే నీతిగా,నిజాయితీగా బతికేవారికి ఈ సమాజంలో చోటుండదు. అనగా చుట్టుపక్కల వారే వారి చర్యలతో ఈ లోకాన్ని వదిలి వెళ్లేలా ప్రేరేపిస్తుంటారు.ఇక మోసాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.డబ్బుల కోసం సొంత కుటంబాన్ని రోడ్డుకు ఇడ్చేవారు లేకపోలేదు.తాజాగా ఓ వ్యక్తి డబ్బుల కోసం ఒకరికి తెలియకుండా ఒకరిని వివాహలు చేసుకున్నాడు. అడ్రస్ ఫ్రూవ్స్ మారుస్తూ రాష్ట్రాలు తిరుగుతూ ఏకంగా 28 ఏళ్లకే 24 మంది యువతులను పెళ్లాడాడు. వారిని పెళ్లి చేసుకోవడం వారి దగ్గర నుంచి డబ్బులు, నగలు తీసుకుని పారిపోవడం ఇతనికి బాగా అలవాటు.

if you get married again it will be silver jubilee
Marriages : ఒకరికి అనుమానం రాకుండా మరొకరు..
వివరాల్లోకివెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అసబుల్ మొల్లా(28)పెళ్లిళ్ల పేరుతో 24 యువతులను మోసం చేశాడు. బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని సాగర్దిగ్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుని మోసం చేయగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.