Lucky Man : ఎక్కడికైనా వెళ్లేటప్పుడు వీటిని చూస్తే… లక్కే లక్కు!
Lucky Man : మనం ఏదానా పని మీద బయటకు వెళ్లేటప్పుు మనకు లక్కు కలిసి వవ్చే వారి మొహం చూసి వెళ్తుంటాం. లేదా దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్తుంటాం. అయితే అలా వెళ్లేటప్పుడు పొరపాటున పిల్లి కనిపించిందంటే… చాలు చటుక్కున వెనక్కి తిరిగి వచ్చేస్తాం. అందులోనూ నల్ల పిల్ల అయితే మహా అపశకునంగా భావించి ఆరోజు చేయాల్సిన పనినే వాయిదా వేసుకుంటుంటా. ఎవరైనా తుమ్మినా, కట్టెలు ఎదురుగా వచ్చినా కాసేపు ఆగి ప్రయాణాన్ని సాగిస్తుంటాం. అయితే మరి దేనిని చూస్తే మంచి జరుగుతుంది… అంతగా మనకు లక్కు కలిసి వస్తుందో తెలుసుకుందామా.సకాల దేవతలు కొలువై ఉన్న గోమాత గురించి మన అందరికీ తెలిసన విషయమే. అయితే గరుడ పురాణం ప్రకారం… గోవు, గోమూత్రం, పంట పొలం, గోధూళి కనిపిస్తే చాలా మంచి జరుగుతుందట.అంతే కాదండోయ్ మనం చేయాలనుకున్న పని చకచకా అయిపోయి విపరీతమైన లక్కు కలిసి వస్తుందట.
మనం వెళ్లే దారిలో ఇందులో ఏ ఒక్కటి కనిపించినా.. నక్క తోక తొక్కినంత లక్కట. లక్ష్మీ దేవిని నేరుగా ఇంట్లోకి ఆహ్వానించినట్లేట. అయితే ఆవు గురించి దాని వల్ల మనకు కలిగే లాభాల గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. మనకు ఎక్కుడ ఆవు కనిపించినా వెంటనే దానిని తాకి దండం పెట్టుకుంటుంటాం. రోజులో ఏ సమయంలో గోమాత కనిపించినా అది శుభ సంకేతానికి సూచకమంట. అలా గోమాత కనిపించి నప్పుడు మనసులో నమస్కరించుకున్నా వీలయితే… దగ్గరకు వెళ్లి దండం పెట్టుకున్న శుభం కల్గుతుందని గరుడ పురాణం చెబుతోంది. అంతే కాదండోయ్ గోమాత దర్శనం వల్ల మనకు ఎదురయ్యే చెడు కూడా దూరం అవుతుందట.అలాగే హిందూ సంప్రదాయాల ప్రకారం గోమూత్రాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో లేదా దేవుడి గుళ్లలో పూజలు చేసేటప్పుడు .. దీనిని కచ్చితంగా ఉపయోగిస్తారు.
మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆవు మూత్రం కనిపిస్తే చాలా మంచిదట. దానిని తాకడం, తాగడం లాంటివి చేస్తే మరింత మంచిది. అది కుదరపోతే కనీసం చూసినా మనకు లక్కు కలిసి వస్తుందట. అయితే గోమూత్రం సేవించడం వల్ల చాలా లాభాలున్నాయని.. అందుకే దానిని ఆయుర్వేద మందుల తయారీలలో వాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.గరుడ పురాణం ప్రకారం.. మనం వెళ్లే దారిలో గోధూళిని, పంట పొలాన్ని చూడటం వల్ల కూడా శుభం కల్గుతుందట. గోవుల మంద వెళ్లేటప్పుడు నేల నుంచి వచ్చే దుమ్ము చాలా పవిత్రమైనదట. ఆ దుమ్ము మనపై పారితే.. మనలో ఉన్న చెడు భావన పోయి ప్రశాంతంగా మారిపోతామట. అంతే కాదండోయ్… పంట పొలాలు.. ముఖ్యంగా అప్పటికే పండిన దైతే.. అది మరింత శుభప్రదం. పండిన పంటలతో నిండిన పొలాన్ని చూస్తే మనిషికి పుణ్యంతో పాటు మంచి జరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ అయిదూ మనకు కనిపిస్తే.. లక్ష్మీదేవి మనతోనే ఉండి లక్కును కల్గజేస్తుందట.