After Tenth : 10వ తరగతి అనంతరం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా..? అయితే ఈ కథనం మీకోసం...!
After Tenth : మరి కొన్ని రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగునున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే 10వ తరగతి విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా మెరుగైన ఫలితాలను సాధించేందుకు కష్టపడుతున్నారు. అయితే వాస్తవానికి 10వ తరగతి అనేది ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన దశ అని చెప్పాలి. ఎందుకంటే ఈ తరగతిలో విద్యార్థి కనబరిచిన ప్రతిభ తన భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అయితే ఈ 10వ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు త్వరగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుకోవాలి అంటే ఏ కోర్సు చేయాలి అనే తికమకలో ఉంటారు. అలాంటి వారి కోసమే కొంతమంది నిపుణుల సలహాల మేరకు పదవ తరగతి అనంతరం ఏ కోర్సులు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు తిరుగుండదనే విషయాలను తెలియజేయడం జరిగింది. ఇక ఈ కథనాన్ని పూర్తిగా చదివి ఆ వివరాలు తెలుసుకోండి.
అయితే పదో తరగతి పూర్తయిన తర్వాత చదువు కొనసాగించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇక వాటిలో విద్యార్థుల భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దే కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకప్పుడు 10వ తరగతి పూర్తయిన వెంటనే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పాలి. అదే విధంగా టెక్నికల్ విభాగాల్లో చేరేందుకే విద్యార్థులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆ కోర్సులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లో చేరినట్లయితే ఎంపీసీ , బైపీసీ ఎంఈసీ ,సీఈసీ గ్రూపులు ఉంటాయి. ఇక వీటిలో ఎంపీసీ ఎంచుకున్నట్లయితే ఇంజనీరింగ్ కెరియర్ కు బంగారు బాటలు వేసుకున్నట్లే. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కూడా రాణించవచ్చు.
ఇక మెడిసిన్ పై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ లో బైపీసీ కోర్సు తీసుకున్నట్లయితే వైద్యరంగంలో వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. అనంతరం విద్యార్థులు mbbs ,bds , ఆయుష్ తదితర మెడిసిన్ సంబంధిత కోర్సుల్లో చేరవచ్చు. ఇక బైపీసీ తో ఫార్మా , లైఫ్ సైన్సెస్ విభాగాలలో విస్తృతమైన అవకాశాలను పొందవచ్చు.
10వ తరగతి అనంతరం విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్స్ ఎంచుకున్నట్లయితే ఇంజనీరింగ్ విభాగంలో రాణించవచ్చు. ఇక ఈ పాలిటెక్నిక్ కోర్స్ పూర్తయిన వెంటనే బీటెక్ కోర్స్ కూడా చేయవచ్చు. ఇక ఈ పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కెమికల్ ,మెటలర్జీ బ్రాంచ్ లు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వారి ఇంట్రెస్ట్ ని బట్టి విద్యార్థి కోర్స్ ఎంచుకోవచ్చు. అంతేకాక పాలిటెక్నిక్ విద్యతో పరిశ్రమలలో ఉద్యోగాలు పొందవచ్చు.
10వ తరగతి తర్వాత వృత్తి రిత్య సరేనా ఉపాధి అందుకోవాలంటే ఐటిఐ మంచి మార్గమని చెప్పాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటిఐ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఫిట్టర్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ తదితర విభాగాల బ్రాంచ్ లు ఉంటాయి. ఇక ఈ కోర్సులు పూర్తి చేసిన వారు పారిశ్రామిక సంస్థలలో టెక్నీషియన్స్ గా ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే అప్రెంటిస్ పూర్తి చేసినట్లయితే ఎన్సీవీటీ సర్టిఫికెట్ ఉన్నట్లయితే రైల్వే మరియు ఇతర ప్రభుత్వ సంస్థ విభాగాల్లో కూడా ఉద్యోగాలను సంపాదించవచ్చు.
రైతులు పండించే పంటలో దిగుబడులు సాధించాలంటే ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేస్తూ యంత్ర పరికరాలను కూడా వాడాలి. దీనికోసమే ప్రభుత్వం అగ్రి పాలిటెక్నిక్ విద్యా సంస్థలను నెలకొల్పింది. వీటిలో ప్రధానమైనది ఇన్ అగ్రికల్చర్ ,మరియు డిప్లమా ఇన్ సీడ్ టెక్నాలజీ ,అలాగే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లమా. ఇక ఈ కోర్సులు ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ఎరువులు పురుగు మందులు సీడ్ కంపెనీలు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు సమృద్ధిగా ఉంటాయి.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.