Betel leaves : ఎదుటివాళ్ళు మీ మాట వినాలంటే తమలపాకుతో ఈ రీతిగా చేయండి… ఇక వాళ్లంతా మీ కంట్రోల్ లోనే ఉంటారు..!!
Betel leaves : కుటుంబంలో లేదా పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కొన్ని సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. వాళ్లలో మార్పు రావాలని వ్యవహార శైలి ఆరాలని చాలామంది సహిస్తూ ఉంటారు. అయినా గాని ఆ వ్యక్తులు ఉన్నా కొద్ది రెచ్చిపోతూ ఉంటారు. దీంతో ఎంతో సహనంగా ఉండే వ్యక్తి.. మానసిక క్శోభకు గురవుతాడు. పరిస్థితుల్లో ఉంటే అటువంటి వ్యక్తులను రెండు తమలపాకులు ఒక కర్పూరం ద్వారా ఈజీగా డీల్ చేయవచ్చట. అయితే ఇక్కడ మంత్రాలు తంత్రాలు తాయతులతో కాకుండా.. మాంత్రికులతో పని లేకుండా కేవలం మనం మాత్రమే చేసే పరిహారం. ఈ పరిహారం ద్వారా ఇతరులను ఇట్టే ఆకట్టుకోవచ్చు. ఈ పరిహారం కోసం తమలపాకుని పచ్చ కర్పూరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. తమలపాకుకి భారతీయ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ ఆకుకి లేని ప్రాధాన్యత తమలపాకుకి ఉంటుంది.
అందుకే భగవంతుడి దగ్గర పెట్టే ఏకైక ఆకు తమలపాకు. ఈ ఆకులో శరీర రక్షణ వ్యవస్థను కాపాడే గుణం ఉంటుంది. ఇక పచ్చ కర్పూరం ఆరోగ్య సమస్యల నుండి వ్యాపారంలో వచ్చే నష్టాల నుండి … దిష్టి తగలకుండా ఉండే సమస్యల నుండి బయట పడేయటానికి బాగా ఉపయోగపడుతుంది. పచ్చ కర్పూరం నుండి వచ్చే ఆ సుగంధ పరిమళం లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించేలా చేస్తోంది. పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర ఒక గాజు పాత్రలో పచ్చ కర్పూరం వేస్తే… ఆ పరిమళానికి అమ్మవారి పరవశించిపోయి కోర్కెలు తీరుస్తుందని చెబుతుంటారు. అయితే ఎదుటి వాళ్ళు మన మాట వినటానికి రెండు తమలపాకులు… ఒక గుప్పెడు పచ్చ కర్పూరం కావలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎప్పుడు ఎవరు ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మంగళవారం, గురువారం, శుక్రవారం. ఈ మూడు రోజులలో ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చు.
మిగిలిన వారాలలో చేయొచ్చుగానీ ఆయన చెప్పిన మూడు రోజులలో చేస్తే రిజల్ట్ త్వరగా కనిపిస్తుంది. ఎవరైతే మనకి తలనొప్పిగా… మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో వారు మన మాట వినాలనుకునే వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చు. ఇక మీరు అనుకున్న రోజున… శ్రీ మహాలక్ష్మి దేవికి పూజ చేసుకుని… మీరు ఉపయోగించాలనుకుంటున్న తమలపాకులు గుప్పెడు పచ్చ కర్పూరాన్ని పూజ గదిలో ఉంచాలి. పూజా కార్యక్రమం అనంతరం… ఈ రెండు తమలపాకుల మధ్యలో ఈ పచ్చ కర్పూరాన్ని పెట్టాల్సి ఉంటుంది. తమలపాకు కొనలు మరియు కాండం కూడా ఒకే రీతిలో ఉండాలి. ఇక రెండిటి మధ్యలో పచ్చ కర్పూరం పెట్టి దాన్ని నాలుగు మడతలు వేసి… ఒక పేపర్ లో చుట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. పేపర్లో దాచిపెట్టిన తమలపాకు పచ్చ కర్పూరం మిశ్రమాన్ని కుడిచేత్తో పట్టుకుని.. సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి దేవి మరియు శ్రీమహావిష్ణువునీ వేడుకోవాలి.
ఎవరికోసం మీరు ఈ ప్రయోగం చేశారో వారి గురించి మీరు వేడుకోవాలి. ఇలా చేసిన వాళ్లు ఆడవాళ్ళు అయితే తమ హ్యాండ్ బ్యాగ్ లో మగవారైతే తమ పరుసులో వారం రోజులపాటు పెట్టిన చోటు నుండి కదపకుండా… జాగ్రత్త పడాలి. ఈ వారం రోజుల్లో కూడా చాలా మార్పులు సంభవిస్తాయి. మీరంటే పడని ఎదుటి వ్యక్తి ఎవరికోసం చేశారో వాళ్లు మీరు ఏది చెబితే అది వినేటట్టు ఉంటారు. వారం రోజుల తర్వాత పేపర్లో చుట్టిన తమలపాకు దాచిన ప్రదేశం నుండి తీసి… మళ్లీ పరిహారం చేసుకొని మీ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. అయితే వాడేసిన తమలపాకు పచ్చ కర్పూరం చెత్తబుట్టలో వేయకుండా… వాటిని పారే నీళ్లలో లేదా.. చెట్టు మొదట్లో ఇంకా దేవాలయ ప్రాంగణంలో ఉండే చెట్ల దగ్గర వేయవచ్చు. పొరపాటున చెత్తకుండీలో వేస్తే ప్రయోగం చేసిన వ్యక్తికి నష్టం వాటిలే అవకాశం ఉందట. ఇలా తమలపాకు పచ్చ కర్పూరం పరిహారం ద్వారా చేసే ప్రయోగం మీకు మనశ్శాంతి లేకుండా చేసే వ్యక్తిని సైతం మిమ్మల్ని ఆకర్షించే రీతిలో చేస్తుందట.