Shani Dosha | మీకు శని దోషం ఉందా.. అది పోవాలంటే ఏం చేయాలి అంటే..!
Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు, బిల్వపత్రాలతో అభిషేకం చేయడం ద్వారా దోష ప్రభావం తగ్గుతుంది. శని యంత్రంతో పూజ చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి.శనిదేవునికి ప్రీతికరమైన శనివారం రోజున లేనివారికి, అవసరమైన వారికి చలువలు చేయండి. శనివారం తెల్లవారుజామున నూనెతో తలస్నానం చేసి శని గాయత్రీ మంత్రం లేదా శని బీజ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించండి. ఇది మంచి బుద్ధి, ఆయురారోగ్యాన్ని కలిగించి శని ప్రభావాలను తగ్గిస్తుంది.

#image_title
ఈ పని చేయండి..
ప్రతీ శనివారం శనిదేవుని ఆలయం మరియు శివాలయాలను దర్శించండి. శివ చాలీసా పారాయణం చదవండి. ప్రతిరోజూ కాకులకు పెసరపప్పు ఇవ్వండి. ఆలయంలో 9 సార్లు నవగ్రహ పూజలు చేయించండి. నీలిరాతి ఉంగరం శని దోష నివారణకు సహాయపడుతుంది .అయితే, దాన్ని ధరిస్తే ముందు జ్యోతిష్య సలహా తప్పనిసరి.
శనివారం తెల్లవారుజామున సుందర కాండ పారాయణం చేయడం వల్ల శనిగ్రహ దోషం తగ్గుతుంది. ఇది ఆత్మబలాన్ని, ధైర్యాన్ని పెంపొందిస్తుంది.ఈ విధంగా శనిదోష నివారణకు శనివారం రోజున పవిత్రతతో, భక్తిశ్రద్ధలతో ఆచరణలోకి తెచ్చే ఈ పూజా విధానాలు శుభ ఫలితాలను అందించగలవు.