Shani Dosha : శని దోష నివారణకు ఈ మంత్రాలను జపించండి… ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి…!
ప్రధానాంశాలు:
Shani Dosha : శని దోష నివారణకు ఈ మంత్రాలను జపించండి... ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి...!
Shani Dosha : శనీశ్వరుడికి నవగ్రహాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని కూడా అంటారు. శని అతి నెమ్మదిగా కదిలే గ్రహం. అయితే కొంతమంది జాతకంలో శని దోషం మరియు ఏలినాటి శని ఉండడం వలన వారి జీవితంలో అనేక కష్టాలు పడుతూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే శనివారం రోజు శని దోష నివారణకు శనీశ్వరుని పూజించడం వలన ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు తొలగి శనీశ్వరుడి ఆశీర్వాదాలు దక్కుతాయి. అయితే శని దోషం ఉంటే జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా వాటి పరిణామాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి శని దోషంతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి వెంటనే దోష నివారణ మార్గాలను పాటించాలి. ఇక శని దోష నివారణలో శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి. వీటిని జపించడం ద్వారా కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Shani Dosha శని దోషం అంటే ఏమిటి
శనీశ్వరుడు మంద గమనుడు. అతి నెమ్మదిగా కదిలే గ్రహం శని. అయితే శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది. అలాగే జాతకంలో చంద్రుడి రాశి నుంచి నాలుగో రాశిలో శని సంచరించడానికి అష్టమ శని అంటారు. రెండున్నర సంవత్సరాల పాటు అష్టమ శని ఉంటుంది. దీనితో శని ప్రభావం ఆ వ్యక్తులపై కనిపిస్తుంది. ఇక ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి జాతకంలో అయినా అష్టమ శని ప్రభావం ఉంటే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఈ సమయంలో మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి.
Shani Dosha శని దోష నివారణకు ఏం చేయాలంటే
శని దోషం నుండి బయటపడడం కోసం కొన్ని మంత్రాలనుు జపించాలి. “ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్. ఉర్వారుక్ మివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మా మృతాత్ ” . ఈ మహా మంత్రాన్ని పఠించడం వలన శని దోషం నుండి బయటపడవచ్చు. ఈ మంత్రాన్ని ప్రతి శనివారం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి.
శనివారం ఈ వస్తువులను దానం చేయండి.
శనీశ్వరుడి ఆశీస్సుల కోసం శనివారం రోజున విరాళాలు ఇవ్వడం మంచిది. అలాగే నలుపు రంగు వస్తువులను దానం చేయవచ్చు. అదేవిధంగా శనివారం నాడు నల్ల ఉసిరి లేదా నల్ల నువ్వులను దానం చేయడం వలన జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు నువ్వుల నూనె లేదా ఆవాలను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఇనుప వస్తువులను కూడా దానం చేయవచ్చు.