Health Tips | బ్రహ్మీ,వందకు పైగా రోగాలకు ఔషధం .. ఆయుర్వేదం చెబుతున్న అద్భుత లాభాలు
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ మొక్కకు ఉన్న ప్రాధాన్యం అంతా విభిన్నంగా ఉంటుంది. దీనినే “సరస్వతి మొక్క” అని కూడా పిలుస్తారు. పేరుకే తగ్గట్టు ఇది తెలివితేటలను పెంచే మాంత్రిక మూలికగా ప్రసిద్ధి చెందింది.
నిపుణుల ప్రకారం, బ్రహ్మీతో ఒకటి రెండు కాదు, వందకు పైగా రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరానికి శాంతి, మనసుకు చైతన్యం ఇవ్వడం దీని ప్రధాన గుణం.
#image_title
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
బ్రహ్మీని రెగ్యులర్‌గా తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది. ఇది మెదడులోని న్యూరాన్ కణాల మధ్య కమ్యూనికేషన్‌ను బలోపేతం చేస్తుంది. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఎక్కువ ఒత్తిడిలో పనిచేసేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
బ్రహ్మీ మూలిక హైబీపీని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరచి గుండె పనితీరును బలోపేతం చేస్తుంది.
బరువు తగ్గడంలో సహాయకారం
బరువు తగ్గాలనుకునేవారికి బ్రహ్మీ మంచి ఎంపిక. ఇది జీవక్రియ రేటును పెంచి, ఆకలిని నియంత్రిస్తుంది. కాలేయానికి మేలు చేయడం ద్వారా ఫ్యాట్ మెటాబలిజాన్ని సరిచేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
బ్రహ్మీ మూలికలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సహజ రక్షణ కవచం లాంటివి. ఇది కాలేయాన్ని శుభ్రపరచి, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సంతులనం చేస్తుంది.
జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది
బ్రహ్మీ మూలికలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణ వ్యవస్థను సరిచేస్తాయి. ఇది మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. టీ, పొడి లేదా క్యాప్సూల్ రూపంలో తీసుకోవచ్చు.