Bank Customers : బ్యాంక్ కస్టమర్స్ ఈ విషయం తెలుసా.. మీ అకౌంట్ యాక్టివ్ లేకపోతే అంతే సంగతులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bank Customers : బ్యాంక్ కస్టమర్స్ ఈ విషయం తెలుసా.. మీ అకౌంట్ యాక్టివ్ లేకపోతే అంతే సంగతులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 August 2024,8:00 pm

Bank Customers : బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీలు జరగకపోవడం వల్ల ఆ బ్యాంక్ ఖాతాలు కొన్ని సార్లు ఫ్రీజ్ అవుతుంటాయి. తమ ఖాతాలు ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంచుకోవాలని బ్యాంక్ లు కస్టమర్స్ ను కోరుతుంటాయి. కానీ కొంతమంది మాత్రం అలా వారి బ్యాంక్ ఖాతాలను ఇన్ యాక్టివ్ లో ఉంచుతారు. ఐతే అలాంటి బ్యాంక్ ఖాతాలపై ఆర్ బీ ఐ ఇప్పుడు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకవేళ బ్యాంక్ ఖాతా తెరచి దాన్ని వాడకుండా ఉన్నట్టయితే ఆ బ్యాంక్ ఖాతా పూర్తిగా తొలగించబడుతుంది. వివిధ ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతా తీసుకుంటారు. డబ్బు ఆదా, వ్యాపారా లావాదేవీలు, ఎఫ్.డి, రికరింగ్ డిపాజిట్లు ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబందించిన ఆన్ లైన్ చెల్లింపులు కూడా దీని ద్వారా చేస్తారు. ఐతే ఎక్కువ కాలం పాటు బ్యాంక్ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉంటే అలాంటి ఖాతాలు సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది.

Bank Customers : ఇన్ యాక్టివ్ ఖాతాలపై ఆర్బీ ఐ కొత్త రూల్..

ఐతే ఇంతకుముందు వరకు ఇలా ఇన్ యాక్టివ్ ఖాతాలు ఉన్నా సరే వాటిని కస్టమర్స్ కు ఇంఫార్మ్ చేసి ఒక లెటర్ రాసి పెడితే యాక్టివ్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అలా కుదరదు. ఒక బ్యాంక్ ఖాతా 730 రోజులు అంటే దాదాపు రెండు ఏళ్లు లావాదేవీలు కలిగి ఉండాలి. ఐతే ఈ వ్యవధిలో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే అది ఇన్ యాక్టివ్ లోకి వెళ్లిపోతుంది. ఐతే అది నిష్రియంగా మారిన తర్వాత దాని యాక్సెస్ ను కస్టమర్స్ కోల్పోతారు. అంతేకాదు దాని నుంచి ఎలాంటి లావాదేవీలు చేయలేరు. ఖాతా మళ్లీ యాక్టివ్ అయ్యే వరకు ఎలాంట్ నిధులు పొందలేరు.

Bank Customers బ్యాంక్ కస్టమర్స్ ఈ విషయం తెలుసా మీ అకౌంట్ యాక్టివ్ లేకపోతే అంతే సంగతులు

Bank Customers : బ్యాంక్ కస్టమర్స్ ఈ విషయం తెలుసా.. మీ అకౌంట్ యాక్టివ్ లేకపోతే అంతే సంగతులు..!

ఐతే ఇలా డార్మాంట్ ఖాతాలను తిరిగి సక్రియం చేయడం కోసం బ్రాంచ్ ని సంప్రదించి యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం నో యువర్ కస్టమర్ కె వై సీ ఫార్మాలిటీస్ ను పూర్తి చేయాలి. మీ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాన్ కు వెళ్లి.. అక్కడ కె వై సీ పత్రాలను అడగాలి. దానితో పాటు రెండు ఫోటోలు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంట్వి పూర్తి చేసి బ్యాంక్ వారికి ఇవ్వాలి. ఒకవేళ జాయింట్ అకౌంట్ హోల్డర్స్ అయితే ఇద్దరి కే వై సీ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే వీటికి ఎలాంటి పెనాల్టీ ఉండదు. కానీ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోతే మళ్లీ దాని కోసం కొంత మీ ఖాతాలో వేసి అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది