CBI : సీబీఐకి బిగ్ బ్యాడ్ నేమ్ రాబోతోంది.. ఇంత దుర్మార్గమా?
CBI : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తోంది సీబీఐ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఆయనే నిజంగా వైఎస్ వివేకాను హత్య చేయించారనుకుంటే, అనుమానం ఉన్నా కూడా సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయొచ్చు. ఇప్పటికే ఆయన తండ్రి భాస్కర రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా. అలాగే.. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్ విధించిన తర్వాత సీబీఐ కస్టడీకి తీసుకెళ్లొచ్చు. ఆయన్నుంచి సీబీఐ ఏం కావాలనుకుంటోంది.
కేవలం వివరాలు సేకరించడానికే అయితే.. నోటీసులు ఇచ్చి పిలిపిస్తే.. ఆయనకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన తల్లి ఆసుపత్రిలో ఉంది. తండ్రి జైలులో ఉన్నారు. ఇప్పుడు తన తల్లికి తన భర్త, తన కొడుకు అవసరం ఎంతో ఉంది. ఈనేపథ్యంలో పదే పదే తల్లికి బాగోలేకున్నా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం దేనికి నిదర్శనం. సీబీఐకి ఎందుకు అవినాష్ రెడ్డి మీద ఎందుకు అంత ఆతృత అనేది తెలియడం లేదు. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదట. ఆయన తల్లికి ఒంట్లో బాగోలేకున్నా సీబీఐ విచారణకు రావాలా? పచ్చ మీడియా ఎందుకు అవినాష్ రెడ్డి విషయంలో అలా చేస్తోంది.
CBI : సీబీఐకి ఎందుకంత ఆతృత
ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది. ఆయన గత శుక్రవారం కూడా సీబీఐ విచారణకు హైదరాబాద్ కు బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో ఆయన తల్లికి బాగోలేదని తెలిసి వెంటనే కర్నూలుకు తిరుగుప్రయాణం అయ్యారు. ఈ విషయం తెలిసి కూడా సీబీఐ మళ్లీ 22న హాజరు కావాలంటూ మళ్లీ నోటీసులు పంపించడం ఏంటి. మరోవైపు ఆసుపత్రి డాక్టర్లు అవినాష్ తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పినా కూడా వినకుండా సీబీఐ ఇలా వ్యవహరించడం దేనికి నిదర్శనం. ఏ ఆధారాలు లేకుండానే విచారణ కోసం అవినాష్ ను సీబీఐ ఎందుకు ఇంత టార్చర్ పెడుతోందో అర్థం కావడం లేదు. అసలు సీబీఐ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం ఏంటంటూ పలువురు మండిపడుతున్నారు.