PPF Calculator : ఈ పథకంలో నెలకు రూ.12,500 జమ చేస్తే… కోటి రూపాయలు పొందవచ్చు…
PPF Calculator : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం పెట్టుబడిదారులకు చాలా సురక్షితమైన పథకాలలో ఒకటి. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పై మంచి రాబడి కూడా వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని 80 సి కింద పిపిఎఫ్ లో సంవత్సరానికి 1.5 లక్షల వరకు పెట్టుబడి పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే మెచ్యూరిటీ తర్వాత వచ్చే వడ్డీ పై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ లేదా త్రేమాసిక లేదా వార్షిక ప్రతిపాదికన పీపీఎఫ్ ఖాతాలో సంవత్సరానికి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం పిపిఎఫ్ పై 7.1 శాతం వడ్డీ అందుబాటులో ఉంది.
కానీ ఆర్బిఐ రేపో రేటును పెంచిన తర్వాత అన్ని బ్యాంకులు FD పై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. అయితే సెప్టెంబర్ చివరిలో ప్రభుత్వం పొదుపు పథకాల వడ్డీరేట్లను సవరించనుంది. దీంతో పీపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. 2015-16 లో పీపిఎఫ్ కు 8.7 శాతం వడ్డీ లభించగా, ఇప్పుడు 7.1% అందిస్తుంది. 20 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే భారీ మొత్తంలో ఆదాయాన్ని పోగు చేసుకోవచ్చు. ఇందులో నెలకు 12,500 పెట్టుబడి పెట్టి 15 ఏళ్ల వరకు పిపిఎఫ్ ఖాతాను కొనసాగించవచ్చు. ఈ ఖాతాదారుడు 43 లక్షల వరకు సంపాదించవచ్చు.
అదే ఖాతాను మెచ్యూరిటీ అయినా ఒక సంవత్సరంలోపు మరో ఐదు సంవత్సరాలు పొడగించుకోవచ్చు. 20 సంవత్సరాలకి 7.1 శాతానికి సంవత్సరానికి 1.5 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం రాబడి 73 లక్షలు అవుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి 1.5 లక్షలు చొప్పున ఇన్వెస్ట్మెంట్తో మొత్తం 1,16,60,769 పొందవచ్చు. అంటే కోటి రూపాయలకు పైన పొందవచ్చు. నెలవారి పెట్టుబడి 12,500 వడ్డీ 7.1%తో 15 సంవత్సరాలకు 43 లక్షలు పొందవచ్చు. అలాగే నెలవారి పెట్టుబడి 12500 వడ్డీ 7.1 శాతంతో 20 సంవత్సరాలకు 73 లక్షలు పొందవచ్చు. నెలవారి పెట్టుబడి 12,500 వడ్డీ 7.1%తో 25 సంవత్సరాలకు 1,16,60,769 అంటే కోటి రూపాయలకు పైన పొందవచ్చు.