Ind VS Sa : తిలక్ , సంజూ విధ్వంస సెంచరీలు..!
ప్రధానాంశాలు:
Ind VS Sa : తిలక్ , సంజూ విధ్వంస సెంచరీలు..!
Ind VS Sa : నేడు జొహానెస్‌బర్గ్ వేదికగా ఇండియా India వర్సెస్ సౌతాఫ్రికా South Africa ఆఖరి టీ 20 మ్యాచ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజూ శాంసన్ , తిలక్ వర్మ సెంచరీలతో విధ్వంసం సృష్టించారు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతులలో 2 ఫోర్లు 4 సిక్సర్ల తో 36 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ వర్మతో సంజూ బాగసామ్యం 210 పరుగులతో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించారు. తిలక్‌వర్మ 41 బంతుల్లో 6 ఫోర్లు 11 సిక్సర్లతో తన రెండో సెంచరీ 120 చేశాడు. తిలక్ కు ఈ సిరీస్‌లో రెండో వ సెంచరీ కావడం విశేషం.
ఓపెనర్ సంజూ 55 బంతుల్లో 6 ఫోర్లు 9 సిక్సర్లతో తన సెంచరీ 109 పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు సిపామ్లాకు అభిషేక్ వికెట్ మాత్రమే దక్కింది. నాలుగు మ్యాచ్ ఈ సిరీస్ భారత్ 2-1 ఆధిక్యంలో ఉండడం విశేషం.
Ind VS Sa రికార్డులు బద్దలు…
1. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేసిన తిలక్ , సంజూ
2. ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు చేసి సంజూ శాంసన్
3. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యదిక సిక్స్‌లు కొట్టిన భారత్ 23
4. టీ 20 చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం 210 చేసిన తిలక్, సంజూ