India Vs New Zealand : ఆయనొస్తే మెరుపులే అన్నారు… సర్ఫ్ వేసి మరి వైట్ వాష్ చేసి పోయారు…!
India Vs New Zealand : సొంత గడ్డపై భారత్ INdia దారుణమైన ప్రదర్శన కనబరుస్తుంది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతుంది. న్యూజిలాండ్ చేతిలో వరుసగా బెంగళూరు, పుణె టెస్టులో Test Match ఓడిపోయిన భారత్ జట్టు.. వాంఖడే టెస్టులో కష్టపడి గెలిచింది. శనివారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9తో నిలవగా ఆదివారం 174 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో విజయానికి 147 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఈ టార్గెట్ ను ఛేదించడం పెద్ద కష్టం ఏమి కాదని అంతా భావించారు. కాని భారత బ్యాట్స్‌మెన్స్ ఒకరితర్వాత ఒకరు పెవీలియన్‌కి క్యూ కట్టారు క్రమంలోనూ టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ స్నినర్ల ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు.
India Vs New Zealand వరస్ట్ పర్‌ఫార్మెన్స్..
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అనూహ్య స్పిన్, అస్థిర బౌన్స్ వికెట్లకు కారణం అనుకుంటే పొరపాటే. చెత్త ఆటతో వికెట్లు కోల్పోయారు.రోహిత్ మరోసారి అనవసరపు షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్ బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్ తన బలహీనత అని విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫుల్ టాస్ బంతికి వెనుదిరిగాడు. బ్యాటర్లు సాధారణ ప్రదర్శనతోనే టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. రోహిత్ శర్మ (11), గిల్(1), కోహ్లీ(1), జైశ్వాల్(5), సర్ఫరాజ్ ఖాన్(1), జడేజా(6) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. పంత్ ఒక్కడే న్యూజిలాండ్ బౌలర్స్‌ని ధాటిగా ఎదుర్కొని 64 పరుగులు చేశాడు.
వాషింగ్టన్ సుందర్(12), అశ్విన్(8),ఆకాశ్ దీప్(0) పరుగులకి ఔట్ అయ్యారు. సుందర్ ఏమైన నిలబెడతాడని అనుకున్నా అద్భుతమైన బౌల్‌కి సుందర్ ఔట్ కావడంతో ఇక పరాజయం ఖరారైంది.సొంత గడ్డపై టీమిండియా అతి పెద్ద పరాజయంగా దీనిని చెప్పవచ్చు. మరోసారి చెత్త బ్యాటింగ్ ప్రదర్శించి దారుణమైన విమర్శలని మూటగట్టుకున్నారు. 24 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ టీమ్ ఇండియన్ గడ్డపై క్లీన్ స్వీమ్ చేసింది. ఈ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ 22 వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్స్ కి 3 వికెట్లు, హెన్రీకి ఒక వికెట్ దక్కింది, మొత్తానికి 147 పరుగులని చేజ్ చేయలేక 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై పరాజయం పాలైంది.