RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు

 Authored By sandeep | The Telugu News | Updated on :29 September 2025,8:00 pm

RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగరీ (NTPC) కింద 8,875 ఖాళీలకు నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

#image_title

గ్రాడ్యుయేట్, అండర్‌గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు అవకాశం

ఈ పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 5,817 ఖాళీలు ఉండగా, అండర్‌గ్రాడ్యుయేట్ (12వ తరగతి ఉత్తీర్ణులు) అభ్యర్థులకు 3,058 పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా గూడ్స్ గార్డ్ (3,423), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (921), స్టేషన్ మాస్టర్ (615) వంటి హోదాలో పోస్టులు ఉన్నాయి.

MMTSలోనూ ఉద్యోగాలు

సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ – 638

చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ – 161

ట్రాఫిక్ అసిస్టెంట్ – 59

అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులు:

కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ – 2,424

అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ – 394

జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ – 163

ట్రైన్స్ క్లర్క్ – 77

రిజర్వేషన్ ప్రకారం SC, ST, OBC, EWS వర్గాలకు ప్రత్యేక కోటా లభిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ ఎలా?

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:

సెప్టెంబర్ 23, 2025 నుంచి
అక్టోబర్ 10, 2025 వరకు

అధికారిక వెబ్‌సైట్: www.rrbcdg.gov.in

దరఖాస్తు ఎలా చేయాలి:

అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి

వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు ఎంటర్ చేయండి

ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి

దరఖాస్తు ఫీజు చెల్లించండి

ఫారమ్‌ను సమర్పించి, కాపీని సేవ్ చేసుకోండి

దరఖాస్తు రుసుము:
వర్గం ఫీజు
జనరల్, OBC, EWS ₹500
SC, ST, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్మెన్ ₹250
పరీక్షా విధానం:
CBT-1 (స్క్రీనింగ్ టెస్ట్):

మొత్తం ప్రశ్నలు: 100

జనరల్ అవేర్‌నెస్ – 40

మ్యాథ్స్ – 30

రీజనింగ్ – 30

వ్యవధి: 90 నిమిషాలు

నెగెటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్

CBT-2 (పోస్ట్ స్పెసిఫిక్):

మొత్తం ప్రశ్నలు: 120

జనరల్ అవేర్‌నెస్ – 50

మ్యాథ్స్ – 35

రీజనింగ్ – 35

వ్యవధి: 90 నిమిషాలు

నెగెటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్

ముఖ్యమైన సూచనలు:

డిగ్రీ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా తమ అర్హత ప్రకారం పోస్టులను ఎంచుకోవాలి

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది