Train | రైలులో అత్యవసర పరిస్థితి వస్తే చైన్ లాగుతాము.. అది ఎలా పనిచేస్తుందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Train | రైలులో అత్యవసర పరిస్థితి వస్తే చైన్ లాగుతాము.. అది ఎలా పనిచేస్తుందో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :12 October 2025,6:31 pm

Train | రైలు ప్రయాణాల్లో ప్రతి కోచ్‌లోనూ కనిపించే “అత్యవసర పరిస్థితుల్లో చైన్ లాగుము” అనే సూచన చాలామందికి తెలుసు. ఎరుపు రంగులో ఉండే ఈ చైన్‌ని లాగితే రైలు వెంటనే ఆగిపోతుందన్న విషయం తెలిసి ఉండొచ్చు. కానీ అసలు ఇది ఎలా పనిచేస్తుందో చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు దీని వెనక ఉన్న సాంకేతికతను తెలుసుకుందాం.

#image_title

చైన్ లాగితే ఎలాంటి ప్రక్రియ జరుగుతుంది?

ప్రతి కోచ్‌లో ఉన్న అత్యవసర చైన్, రైలు బ్రేకింగ్ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు ఈ చైన్ లాగితే అక్కడి కోచ్‌లో ఉన్న ఎయిర్ బ్రేక్ పైప్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. భారీ శబ్దంతో గాలి బయటకు పోతుంది. ఈ చర్య వల్ల రైలు మొత్తం వ్యవస్థలో ఎయిర్ ప్రెషర్ తగ్గుతుంది. ఇంజిన్ క్యాబిన్‌లో ఉన్న మీటర్‌లో ప్రెషర్ తగ్గినట్లు కనిపిస్తుంది.

దీంతో అలారం మోగుతుం ఇది లోకోపైలట్‌కు అప్రమత్తం చేసే సంకేతం. ఆ సమ‌యంలో లోకోపైలట్ మూడుసార్లు హారన్ మోగించి గార్డును, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తాడు.రైలును ఆపేస్తాడు .గార్డు లేదా సెక్యూరిటీ సిబ్బంది చైన్ లాగిన కోచ్ వద్దకు వెళ్లి కారణం తెలుసుకుంటారు.

ఏ సమయాల్లో చైన్ లాగాలి?

చెప్పుకోదగ్గ అత్యవసర పరిస్థితులలో మాత్రమే చైన్ లాగాలి. ఉదాహరణకు:

కోచ్‌లో మంటలు చెలరేగినపుడు

ప్రయాణికుడు రైలు నుండి ప్రమాదవశాత్తూ పడిపోవడం జ‌రిగిన‌ప్పుడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది