iPhone : ఐఫోన్ ఈ ఫోన్ వాడేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ కొద్ది మంది మాత్రమే వాడుతారు. ఎందుకంటే దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉండదు. దీని కారణంగా ఐఫోన్ కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అవి కలలుగానే మిగిలిపోతుంటాయి. కానీ ప్రస్తుతం ఆ కల నిజమయ్యే చాన్స్ వచ్చిందనే అనిపిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ ధర రూ.20వేల కంటే తక్కువకు పడిపోనుందనే వార్తలు వస్తున్నాయి. మరి అది ఎందుకు అంత తక్కువగా పడిపోతోంది. దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ ఎస్ఈ 2జీ మొబైల్‌ను యాపిల్ కంపెనీ 2020లో విడుదల చేసింది. త్వరలో ఈ ఐఫోన్ ఎస్ఈ ధర రూ.20వేలకు పడిపోవచ్చని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ పేర్కొన్నారు. యాపిల్ అతిత్వరలో తక్కువ ధరకే 5జీ మొబైల్‌గా ఐఫోన్ ఎస్ఈ 3ను తీసుకరావాలని రెడీ అయింది. మార్చి 8న తేదీన ఒక ఈవెంట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. దీని ధర 300 డాలర్ల నుంచి 350 డాలర్ల ధర మధ్య ఉంటుందని అంచనా. అంటే భారత్‌లో దీని ధర రూ.30వేల నుంచి రూ.35వేల మధ్య ఉండనుంది. 2020లో లాంచ్ అయిన టైంలో రూ.43 వేలుగా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గింది.
ఈ కామర్స్ స్పెషల్ సేల్ లో ఈ ఫోన్ చాలా సార్లు రూ.26 వేలకు సైతం లభించింది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ 64జీబీ వేరియంట్ ధర సుమారు రూ.30వేల వరకు ఉంది. ఒకవేళ ఇది రూ.20వేలలోపు అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌లకు పోటీ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఎంతైనా.. ఎన్ని ఫోన్లు ఉన్న యాపిల్ బ్రాండ్ ఉన్న క్రేజ్ వేరే అనే చెప్పాలి. మరి రూ.20 వేలకే ఫోన్ వస్తే యాండ్రాయిడ్ ఫోన్లు కొనుగోలు తగ్గిపోవచ్చే అంచనా సైతం మొదలైంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.