iPhone : ఐ‌ఫోన్ మరీ ఇంత తక్కువ ధరకా? కారణాలేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

iPhone : ఐ‌ఫోన్ మరీ ఇంత తక్కువ ధరకా? కారణాలేంటి?

iPhone : ఐఫోన్ ఈ ఫోన్ వాడేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ కొద్ది మంది మాత్రమే వాడుతారు. ఎందుకంటే దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉండదు. దీని కారణంగా ఐఫోన్ కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అవి కలలుగానే మిగిలిపోతుంటాయి. కానీ ప్రస్తుతం ఆ కల నిజమయ్యే చాన్స్ వచ్చిందనే అనిపిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ ధర రూ.20వేల కంటే తక్కువకు పడిపోనుందనే వార్తలు వస్తున్నాయి. మరి అది ఎందుకు అంత తక్కువగా పడిపోతోంది. దాని […]

 Authored By mallesh | The Telugu News | Updated on :2 March 2022,2:00 pm

iPhone : ఐఫోన్ ఈ ఫోన్ వాడేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ కొద్ది మంది మాత్రమే వాడుతారు. ఎందుకంటే దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉండదు. దీని కారణంగా ఐఫోన్ కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అవి కలలుగానే మిగిలిపోతుంటాయి. కానీ ప్రస్తుతం ఆ కల నిజమయ్యే చాన్స్ వచ్చిందనే అనిపిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ ధర రూ.20వేల కంటే తక్కువకు పడిపోనుందనే వార్తలు వస్తున్నాయి. మరి అది ఎందుకు అంత తక్కువగా పడిపోతోంది. దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ ఎస్ఈ 2జీ మొబైల్‌ను యాపిల్ కంపెనీ 2020లో విడుదల చేసింది. త్వరలో ఈ ఐఫోన్ ఎస్ఈ ధర రూ.20వేలకు పడిపోవచ్చని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ పేర్కొన్నారు. యాపిల్ అతిత్వరలో తక్కువ ధరకే 5జీ మొబైల్‌గా ఐఫోన్ ఎస్ఈ 3‌ను తీసుకరావాలని రెడీ అయింది. మార్చి 8న తేదీన ఒక ఈవెంట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. దీని ధర 300 డాలర్ల నుంచి 350 డాలర్ల ధర మధ్య ఉంటుందని అంచనా. అంటే భారత్‌లో దీని ధర రూ.30వేల నుంచి రూ.35వేల మధ్య ఉండనుంది. 2020లో లాంచ్ అయిన టైంలో రూ.43 వేలుగా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గింది.

iphone 2020 may cost as low rs 20000 soon

iphone 2020 may cost as low rs 20000 soon

iPhone : 5జీ ఫోన్ లాంచ్ చేసే ఛాన్స్..

ఈ కామర్స్ స్పెషల్ సేల్ లో ఈ ఫోన్ చాలా సార్లు రూ.26 వేలకు సైతం లభించింది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ 64జీబీ వేరియంట్ ధర సుమారు రూ.30వేల వరకు ఉంది. ఒకవేళ ఇది రూ.20వేలలోపు అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు పోటీ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఎంతైనా.. ఎన్ని ఫోన్లు ఉన్న యాపిల్ బ్రాండ్ ఉన్న క్రేజ్ వేరే అనే చెప్పాలి. మరి రూ.20 వేలకే ఫోన్ వస్తే యాండ్రాయిడ్ ఫోన్లు కొనుగోలు తగ్గిపోవచ్చే అంచనా సైతం మొదలైంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది