YS Jagan : ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గడా.!? లేదంటే వదిలేసాడా.!?
YS Jagan : ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే.. ఆ రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలకు బాధ్యత వహించాలి. ప్రజలకు కావాల్సిన పాలన చేయాలి. వాళ్ల కోసం సంక్షేమ పథకాలు ప్రారంభించడం, పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించడం, ఇలా అన్ని రకాల సమస్యలపై సీఎం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా రాష్ట్రం అల్లకల్లోలం కావాల్సిందే. అయితే.. ప్రజల కోసం, ప్రజలను ఆకర్షించేందుకు, ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్పు తెచ్చి మరీ ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
పక్క రాష్ట్రం తెలంగాణలోనూ అదే జరుగుతోందనే వార్తలు వస్తున్నాయి. అయితే.. తెలంగాణలో మాత్రం ప్రజల నుంచి ఎలా రాబడిని పెంచుకోవాలి అనే దానిపై తెలంగాణ రాష్ట్రం ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అంతో ఇంతో ప్రభుత్వ ఖజానాకు వస్తోంది. దీంతో ప్రజలు ప్రభుత్వానికి కట్టే డబ్బుపై తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఫోకస్ చేస్తోంది. మరి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. సీఎం జగన్ ఒక బిజినెస్ మ్యాన్ అని తెలిసిందే కదా. ఆయన ముఖ్యమంత్రి కాకముందే.. తన తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే మంచి బిజినెస్ మ్యాన్. వ్యాపారవేత్తగా చాలా విజయాలు సాధించారు.
YS Jagan : ఏపీ ఖజానాలో ఎందుకు నిధుల కొరత వెంటాడుతోంది
ఆయన వ్యాపార సామ్రాజ్యం తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించింది. మరి.. ఆయన వ్యాపారాలు బాగున్నప్పుడు ఏపీ ఖజానా మాత్రం ఎందుకు నిధుల కొరతతో సతమతం అవుతోంది అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. పక్క రాష్ట్రం తెలంగాణలో నిధుల కోసం సీఎం కేసీఆర్ ఎలా ప్రజల నుంచి ముక్కు పిండి మరీ ప్రభుత్వానికి వచ్చే డబ్బులను వసూలు చేస్తుంటే.. సీఎం జగన్ అలాంటి వ్యూహాలను ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని అయినా ఏపీ ఖజానాకు డబ్బుల వర్షం కురిసేలా సీఎం జగన్ ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో అని.