Chandrababu : చంద్రబాబు పక్కన ‘ఆ కులం’ నిలబడింది.. జగన్ పక్కన ‘ఈ కులం’ నిలబడింది
Chandrababu : ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సామాజిక వర్గం మద్దతు ఉండాలి. లేకపోతే గెలవడం కష్టం. అందుకే కొన్ని పార్టీలు కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుంటాయి. వాటి మీద ఫోకస్ పెడతాయి. ఆయా సామాజిక వర్గాలకు వరాలు కురిపిస్తాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు నాయుడు పక్కన ఎప్పుడూ బీసీలు, ఎస్సీలు ఉంటారని, ఆయన చుట్టు ఎప్పుడూ వాళ్లే కనిపిస్తారని, కానీ.. జగన్ పక్కన మాత్రం ఎప్పుడూ రెడ్లే ఉంటారని, ఆయన ముందు చూసినా రెడ్లే.. వెనుక చూసినా రెడ్లే అని అచ్చెన్నాయుడు విమర్శించారు.
కేవలం రెడ్లకే రాష్ట్రాన్ని జగన్ కట్టబెట్టారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కేవలం బీసీలపై అధికారం చెలాయించడానికే, పెత్తనం చేయడానికే సీఎం జగన్.. రెడ్లకు అధికారం కట్టబెట్టారని ధ్వజమెత్తారు. బీసీల కోసం కొత్తగా జగన్ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఆదరణ పరికరాలు ఇస్తే చాలు. టీడీపీ హయాంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కొనుగోలు చేసిన ఆదరణ పరికరాలను మూలన పడేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి అదేమీ జగన్ తాత కట్టిన యూనివర్సిటీ కాదు.. అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Chandrababu : బీసీ సాధికారిత సమితి సూచనలు పాటిస్తాం
బీసీ సాధికారిత సమితి పలు సూచనలు చేసిందని.. వాళ్లు ఇచ్చిన సూచనలు, సలహాలను మేనిఫెస్టోలో పెడతామని అచ్చెన్నాయుడు ఈసందర్భంగా స్పష్టం చేశారు. అందుకే టీడీపీ బీసీలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోందా.. వైసీపీ బీసీలను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికలు వచ్చేసరికి.. అన్ని సామాజిక వర్గాల అవసరం ప్రతి పార్టీకి ఉంటుంది. చూద్దాం.. ఎన్నికల వరకు ఏ సామాజిక వర్గం ఏ పార్టీవైపు మళ్లుతుందో?