Tirupati bypoll : వైఎస్సార్సీపీకి తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి గురుమూర్తి ప్లస్సా? మైనసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tirupati bypoll : వైఎస్సార్సీపీకి తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి గురుమూర్తి ప్లస్సా? మైనసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 April 2021,2:45 pm

Tirupati bypoll : ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉపఎన్నిక గురించే చర్చ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్. సోషల్ మీడియాలోనూ తిరుపతి ఉప ఎన్నిక టాపికే ట్రెండింగ్ లో ఉంది. నిజానికి ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ… ఎంపీ కానీ.. ఇతర పదవుల్లో ఉన్నవాళ్లు కానీ చనిపోతే… ఆయా కుటుంబంలోకి వారికే టికెటు ఇస్తుంటాయి పార్టీలు. ఎందుకంటే సానుభూతితో మళ్లీ ఆ కుటుంబంలోని వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారని భావించి.. ప్రతిపక్ష పార్టీలకు చాన్స్ ఇవ్వకుండా చూస్తారు. తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ చనిపోయిన ఎమ్మెల్యే సోలిపేట భార్యకే టికెట్ ఇచ్చింది. సాగర్ ఉపఎన్నికలోనూ అంతే. టీఆర్ఎస్ పార్టీ చనిపోయిన ఎమ్మెల్యే నోముల కొడుకు భగత్ కు టికెట్ ఇచ్చింది. కొన్ని సార్లు సానుభూతి వర్కవుట్ కావచ్చు… కాకపోవచ్చు.. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వర్కవుట్ కాలేదు. ఏది ఏమైనా.. చనిపోయిన నాయకుడి కుటుంబంలోని ఒకరికే టికెట్ ఇవ్వడం అనేది చాలా ఏళ్ల నుంచి వస్తోంది.

is gurumurthy strength for ysrcp in tirupati bypoll

is gurumurthy strength for ysrcp in tirupati bypoll

అయితే.. తిరుపతి ఉపఎన్నికల్లో మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. చనిపోయిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కొడుకుకు వైపీపీ టికెట్ ఇవ్వలేదు. దుర్గా ప్రసాద్ కొడుకు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ… ఆయనకు కాకుండా అసలు రాజకీయాలే తెలియని గుర్తుమూర్తికి వైసీపీ టికెట్ కన్ఫమ్ చేసింది. అయితే… బల్లి దుర్గా ప్రసాద్ కొడుకు కల్యాణ్ కు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని సీఎం జగన్ మాటివ్వడం వల్ల… తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వలేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అదంతా బాగానే ఉంది కానీ… వైసీపీ బరిలోకి దింపిన గురుమూర్తి ఒక డాక్టర్. ఆయనకు రాజకీయాలు తెలియవు. అదే ఇప్పుడు వైసీపీకి లేనిపోని తలనొప్పులను తీసుకొస్తోంది.

Tirupati bypoll : గురుమూర్తి విజయం కోసం చెమటోడ్చుతున్న స్థానిక వైసీపీ నేతలు

అసలే రాజకీయాలకు కొత్త అయిన గురుమూర్తి ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా మాట్లాడటం లేదు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కు పెట్టడం లేదు. ఆయన అభ్యర్థి కాబట్టి.. కాస్తయినా నోరు విప్పాలి కానీ… ఆయన గొంతే విప్పకపోవడంతో వైసీపీలో లేనిపోని కలవరం స్టార్ట్ అయింది. మరోవైపు ప్రచారంలో టీడీపీ, బీజేపీ నేతలు దూసుకెళ్తుంటే గురుమూర్తి మాత్రం కనీసం ప్రచారంలోనూ యాక్టివ్ గా లేరని వైసీపీ నేతలు అంటున్నారు. చివరకు సీఎం జగన్ ప్రచార సభ కూడా క్యాన్సిల్ కావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక… వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలు.. వైసీపీకి గురుమూర్తి ప్లస్ అయ్యారా? మైనస్ అయ్యారా? అనే విషయం తెలియక… అంతా గందరగోళం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో మాత్రం వైసీపీ కాస్త వెనకపడినట్టే అనిపిస్తోంది. మరి… తిరుపతి ప్రజలు గురుమూర్తిని స్వాగతిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది