Kalvakuntla Kavitha : ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాస్త కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. అవును.. ఎందుకంటే.. ఈ స్కామ్ లో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత చిక్కుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా ఈ కేసులో ఉన్నారు. ఈడీ ఇటీవలే ఈ స్కామ్ పై వీళ్ల పేర్లను చార్జ్ షీట్ లో చేర్చింది. ఆ లిస్టులో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేర్చారు. లిక్కర్ స్కామ్ లో అసలు కవిత పాత్ర ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. చార్జ్ షీట్ లో ఆమె పేరు రావడంతో కవిత ఈ స్కామ్ లో ఇరుక్కుపోయినట్టే అని అనిపిస్తోంది.
ఎందుకంటే.. కవిత పాత్ర ఇందులో ఉన్నట్టు పక్కాగా తెలిసిపోతోంది. ఆ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించేందుకు కవిత ఇన్నాళ్లూ ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా తెలియదు. ప్రస్తుతం బీజేపీ టార్గెట్ తెలంగాణ కాబట్టి.. ఈడీ ఈ కేసులో కవితపైనే ముందు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను దెబ్బ కొట్టాలంటే అది కేవలం ఈ స్కామ్ ద్వారానే సాధ్యం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎన్నికల ముంగిట ఈ కేసుపై దృష్టి సారించింది.
బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం దేశమంతా విస్తరిస్తోంది. ఈనేపథ్యంలో పార్టీకి కళ్లెం వేయాలంటే… కేసీఆర్ ను ఈ స్కామ్ లోనే ఇరికించాలని అనుకుంటోంది బీజేపీ ప్రభుత్వం. అందుకే.. లిక్కర్ స్కామ్ లో కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కు కళ్లెం వస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడం ఆపేస్తుందని.. లేకపోతే పార్టీ ఇతర రాష్ట్రాల్లో పాగా వేసిందంటే అది బీజేపీకి మైనస్ అవుతుందని భావించి ఈ ప్లాన్ ను బీజేపీ సెట్ చేసినట్టు తెలుస్తోంది. కవిత ద్వారా కేసీఆర్ కు కేంద్రం ఉచ్చు బిగించబోతుందని అర్థం అవుతోంది. చూద్దాం మరి.. ఈ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుందో?
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.