Telangana Night Curfew : బ్రేకింగ్.. తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ షురూ…? ఎప్పుడంటే…!
Telangana Night Curfew : తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. కేసులు క్రమంగా పెరగడంతో పరిక్షల సంఖ్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుంది. ఇక మరణాల సంఖ్యకు సంబంధించి కూడా కాస్త ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో లాక్ డౌన్ తరహా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినపడుతుంది.
రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో నైట్ కర్ఫ్యూ పై హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన చేసారు. డీహెచ్ డాక్టర్ డి.శ్రీనివాసరావు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసారు. పాజిటివిటీ రేటు పది శాతం దాటితే మాత్రం నైట్ కర్ఫ్యూ విధిస్తామని ఆయన స్పష్టం చేసారు. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందన్న ఆయన…
ఒక్క జిల్లాలో కూడా ఆ రేటు 10శాతం మించలేదని స్పష్టం చేసారు.రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి హైకోర్ట్ లో నేడు విచారణ ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇక ఏపీ సహా పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి.