Chicken | చికెన్‌కి నిమ్మరసం కలిపితే ఏమౌతుందో తెలుసా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు!
Chicken | ఆదివారం రాగానే వంటింట్లో సువాసనలతో చికెన్ వంట మొదలవుతుంది. నాన్ వెజ్ ప్రియుల భోజనాల్లో చికెన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలతో ఉండే చికెన్, చాలా తేలికగా వండేసే వీలుండటం, రుచి కూడా అద్భుతంగా ఉండటం వల్ల ఇది అత్యధికంగా వాడబడే మాంసాహార వంటకం. అయితే చాలా మందికి ఒక సంశయం ఉంటుంది. “చికెన్‌లో నిమ్మరసం పిండితే మంచిదా? అన్నదే ప్రశ్న.

#image_title
ఎలాంటి లాభాలు..
నిపుణుల ప్రకారం, చికెన్‌లో నిమ్మరసం కలిపితే ఆరోగ్యానికి మంచిదే కాకుండా, వంటలోను, జీర్ణవ్యవస్థలోను చాలా ప్రయోజనాలు ఉన్నాయి . నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కారణంగా చికెన్‌లోని ప్రొటీన్లు చిన్న చిన్న భాగాలుగా విడిపోయి సాఫ్ట్‌గా మారుతాయి. ఇది వండే సమయంలో చికెన్ మృదువుగా, తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కొంతమంది చికెన్ తిన్న తర్వాత జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి వారు నిమ్మరసం కలిపిన చికెన్ తింటే బాగుంటుంది.
చికెన్‌ను స్కిన్‌తో తినేవారు ఎక్కువగా కొవ్వు తీసుకుంటారు. అలాంటి సమయంలో నిమ్మరసం కొవ్వు శాతాన్ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. చికెన్‌ను వండేముందు మ్యాగ్నేట్ చేయడం అనేది కామన్. ఈ సమయంలో నిమ్మరసం కలపడం వల్ల మసాలాలు బాగా అరిగి చికెన్‌లోకి ప్రవేశిస్తాయి. ఇది రుచిని పెంచడమే కాక, వండిన తర్వాత ముక్కలు మరింత రుచిగా తయారవుతాయి. రుచిని పెంచడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా అందించడంలో సహాయపడుతుంది.