Gas leak : గ్యాస్ లీకైతే వచ్చే వాసన వెనుక ఇంత స్టోరీ ఉందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gas leak : గ్యాస్ లీకైతే వచ్చే వాసన వెనుక ఇంత స్టోరీ ఉందా..?

Gas leak :  మనలో చాలా మందికి గ్యాస్‌ స్టవ్‌ను ఎలా ఉపయోగించాలో తెలీదు. వంటింట్లో కొందరు కంగారు కంగారు వంటలు చేసి స్టవ్ కట్టేయకుండా వదిలేసి వెళ్లిపోతారు. ఫలితంగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ స్టవ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది అయితే ఆటోమెటిక్ టైమర్ పెట్టెస్తే చాలు.. వంట అయిపోయాక దానంతట అదే ఆఫ్ చేసేసుకుంటుంది. అందుకే సింపుల్ అండ్ సులువుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్, ఇండక్షన్ స్టవ్స్‌కు ఓటేస్తున్నారు జనాలు.. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :27 November 2021,1:58 pm

Gas leak :  మనలో చాలా మందికి గ్యాస్‌ స్టవ్‌ను ఎలా ఉపయోగించాలో తెలీదు. వంటింట్లో కొందరు కంగారు కంగారు వంటలు చేసి స్టవ్ కట్టేయకుండా వదిలేసి వెళ్లిపోతారు. ఫలితంగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ స్టవ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది అయితే ఆటోమెటిక్ టైమర్ పెట్టెస్తే చాలు.. వంట అయిపోయాక దానంతట అదే ఆఫ్ చేసేసుకుంటుంది. అందుకే సింపుల్ అండ్ సులువుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్, ఇండక్షన్ స్టవ్స్‌కు ఓటేస్తున్నారు జనాలు.. సడన్‌గా ఎలక్ర్టిక్ వైపు మారడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతుండంతో ప్రత్యామ్నాయంగా అందరూ దీనిని ఎంచుకుంటున్నారు. అలా అని దీనికి డబ్బులు ఖర్చు కావు అనుకుంటే పొరపాటే.. కరెంట్ బిల్ రూపంలో దీని మెయింటెన్స్ ఉంటుంది. ఎంత వాడుకుంటే అంత..!

పూర్వం వంట కోసం కట్టెల పొయ్యిని వాడేవారని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్స్ వచ్చాయ్. వాటి తర్వాత జనాలు ఎల్పీజీ గ్యాస్‌కు అలవాటు పడ్డారు జనాలు. కొన్ని ప్రదేశాల్లో ఎల్పీజీ సాయంతో వాహనాలు నడిపిస్తుంటారు. ఇంజన్‌కు ఫ్యూయల్‌, జనరేటర్స్‌కు బ్యాకప్‌గా ఎల్పీజీ ఉపయోగపడుతుంది. డీజిల్‌ను స్టోర్ చేసుకోవడం చాలా కష్టం. అయితే, ఎల్పీజీ డీగ్రేడ్ అవ్వకుండా భద్రపరుచుకోవడం చాలా సులభం అని తెలుస్తోంది.

is there such a story behind the smell of a gas leak

is there such a story behind the smell of a gas leak

Gas leak: గ్యాస్ నిజానికి వాసన రాదా..?

ఎల్పీజీ సిలిండర్స్‌ను ఉపయోగించడం చాలా సులభం. కానీ కొందరు కంగారులో తప్పులు చేయడం వలన అది ప్రమాదానికి కారణమవుతుంది. అయితే, నిజానికి గ్యాస్ అనేది వాసన రాదట.. అలాంటి సమయంలో గ్యాస్ లీక్ అయితే ప్రమాదాన్ని ఎలా గుర్తిస్తారు. జరగబోయే విపత్తును ఎలా ఆపుతారు. వీటి గురించి చాలా పరిశోధనలే జరిగాయి. గ్యాస్ అనేది ప్రమాదకారి. అందుకే ప్రమాదాల బారి నుంచి కాపాడుకోవడానికి, గ్యాస్ లీకైతే గుర్తించడానికి వీలుగా దానికి వాసన వచ్చేలా కెమికల్ మిక్స్ చేశారని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా LPG తయారీలో ప్రొపేన్, బ్యూటేన్‌ను ఉపయోగిస్తారు. వీటికి సహజంగానే రంగు, వాసన గుణాలను కలిగి ఉండదు. అందుకోసమే ఎల్పీజీ గ్యాస్ తయారీలో ఈథైల్ మెర్కాప్టెన్ అనే కెమికల్‌ను మిక్స్ చేస్తారట.. దీని ద్వారా గ్యాస్‌కు వాసన గుణం వస్తుంది. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే వాసన ద్వారా మనం వెంటనే అప్రమత్తమై ప్రమాదాలను నివారించవచ్చును.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది