Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్
ప్రధానాంశాలు:
Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి వరద జలాల వినియోగంపై లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారి తీస్తున్నాయని విమర్శించారు. లోకేశ్ ముందుగా వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి సరిగ్గా అవగాహన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు సున్నితమైనవని, వాటిని రెచ్చగొట్టేలా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టించడం సరికాదని హెచ్చరించారు.

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar : చంద్రబాబు ఇలాంటి పనులు చెయ్యొద్దు – పొన్నం ప్రభాకర్
ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన వీడియోలో మంత్రి పొన్నం మాట్లాడుతూ, “తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన నీటి వినియోగం పూర్తయిన తర్వాత మాత్రమే వరద జలాల గురించి మాట్లాడాలి. ఆ వాస్తవం తెలియకుండానే నారా లోకేశ్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కేంద్రం, ట్రిబ్యునల్స్ నిర్ణయించిన వాటా మేరకే నీటి వినియోగం జరుగుతుంది. ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణ వదులుకోదని స్పష్టం చేస్తున్నా. నారా లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నాయని తీవ్రంగా ఖండిస్తున్నా” అన్నారు.
నీటి హక్కుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం తలెత్తకుండా చంద్రబాబు వంటి సీనియర్ నాయకులు జాగ్రత్త వహించాలని పొన్నం సూచించారు. “మా రాష్ట్ర హక్కులు మేము కాపాడుకుంటాం, మీ రాష్ట్ర ప్రయోజనాలను మీరు కాపాడుకోండి. కానీ ప్రజలను మోసం చేసేలా తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదు. నికర జలాలపై మిగులు జలాల వినియోగం తర్వాత మాత్రమే వరద జలాల గురించి ఆలోచించాలి. ఇది ప్రాంతీయత వ్యవహారం కాదని, మా రైతుల హక్కుల కోసం మేము న్యాయమైన పోరాటం చేస్తాం” అంటూ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.