It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం ... డిప్రెషన్ నుంచి బయటపడేదెలా...?

It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణం ఒత్తిడి వలన అని చెబుతున్నారు మానసిక వైద్యులు. కంపెనీలలో పరుగులు పెట్టేలా ఉండే వాతావరణం,ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వంటివి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయంటున్నారు మానసిక వైద్యులు.

It Professionals Faces ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం డిప్రెషన్ నుంచి బయటపడేదెలా

It Professionals Faces : ఐటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలకు కారణం … డిప్రెషన్ నుంచి బయటపడేదెలా…?

It Professionals Faces ఐఐటి ఉద్యోగుల ఒత్తిడికి కారణాలు

బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా చేసే పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారు ఎక్కువ ఒత్తిడికి గురవుడం మనకి తెలిసినదే. ఎక్కువ సేపు కూర్చొని గంటలు తరబడి పనిచేయడం, సమయానికి పనులు పూర్తి చేయాలి అనె ఒత్తిడి,ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం, అన్ని కలిసి ఉద్యోగస్తులకు కష్టమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, వారు మానసిక ఒత్తిడికి గురై, ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు.

It Professionals Faces మానసిక ఆరోగ్యం పై ప్రభావం

ఉద్యోగాలలో ఉండే ఒత్తిడి మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులు ఆందోళన, డిప్రెషన్ కి గురవడం,బాగా అలసిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.ఒంటరిగా ఫీల్ అవుతూ, తమ ఉద్యోగాల్లోని ఒత్తిడిని తట్టుకోలేక పోతారు. అందుకే,ఐటీ పరిశ్రమలో ఆత్మహత్యల సంఖ్య చాలా పెరుగుతూ వస్తుంది.

సహాయం చేసే వ్యవస్థల అవసరం : పనిచేసే చోటా సరైన సహాయం చేసే వ్యవస్థను ఉండటం చాలా అవసరం. కంపెనీలు ఉద్యోగాలలో ఒత్తిడి కౌన్సిలింగ్ అందించాల్సిన అవసరం కూడా ఉంది.అయితే, ఉద్యోగులకు నచ్చినట్లుగా పనిచేసుకునే అవకాశం ఇవ్వాలి. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటే ఒత్తిడి తగ్గి వారికి ఆత్మహత్యలు కారణం కాకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లేదంటే వాళ్లు తీవ్రమైన డిప్రెషన్ అంటే ఆందోళనలో పడే ప్రమాదం ఉంది.

కంపెనీలు, ప్రభుత్వాల పాత్ర : ఉద్యోయోగం చేసే వారిలో విపరీతంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడి, పరిష్కరించడంలో కంపెనీలు ముఖ్యమైన పాత్రను పోషించాలంటున్నారు నిపుణులు. ఉద్యోగులు వ్యక్తిగత జీవితానికి, పనికి మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి ప్రభుత్వ ఉద్యోగాలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే చట్టాలు తీసుకురావాలి. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ రంగంలో మార్పులు రావడానికి వీలుంటుంది.

మార్పు రావాలి : ప్రస్తుతం ఐటి ఉద్యోగాలు చేస్తున్న యువతి,యువకులలో ఆత్మహత్యలు పెరగడం వారిలో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక ఆందోళన స్పష్టంగా చూపిస్తుంది. భారత టెక్ రంగంలో తగిన సహాయం చేసే వ్యవస్థలు, సరైన విధానాలు ఉంటే పని ఒత్తులు తగ్గించవచ్చు. ఐటి ఉద్యోగులు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒత్తిడిని తగ్గించుకోనేందుకు యోగ, మెడిటేషన్ చేసుకోవాలి.వారి జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటు, ప్రభుత్వాలు కూడా వారి కోసం సహకారాన్ని అందించాలని ముఖ్యంగా కంపెనీల పని విధానాలలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు నిపుణులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది