Viral Video : ఇదెక్కడి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైరల్ వీడియో !
ప్రధానాంశాలు:
Viral Video : ఇదెక్కడి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైరల్ వీడియో !
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కారణం అక్కడ పాటించబడుతున్న ఒక వింత ఆచారం.గ్రామానికి చెందిన గుమ్మా వెంకటనారాయణ, గంగమ్మల కుమారుడు నాగార్జున, యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రతో వివాహ బంధంలోకి ప్రవేశించాడు.

Viral Video : ఇదెక్కడి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి !
Viral Video : ఇదొక వింత..
వివాహం పూర్తైన తర్వాత, అక్కడి సంప్రదాయానికి అనుగుణంగా, వధూవరులు పాత్రలు మారి పూజలు నిర్వహించారు.పెళ్లి తంతు పూర్తయ్యాక, నాగార్జున పసుపు దుస్తులు ధరించి వధువు వేషంలో, సుమిత్ర వరుడు వేషంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది అక్కడి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఈ పూజా విధానం ప్రకారం, పాత్రలు మారిన వధూవరులు దేవుడికి అర్పణగా ప్రత్యేకంగా హారతులు ఇచ్చి, ఆశీర్వాదాలు పొందారు.
స్థానికుల నమ్మకం ప్రకారం, ఈ విధంగా పాత్రలు మారి పూజలు చేస్తే త్వరగా సంతానం కలుగుతుందని, అలాగే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ గ్రామస్తులు గౌరవంగా కొనసాగిస్తున్నారు.ఇలాంటి ఆచారాలు వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు గానీ, స్థానికుల నమ్మకంతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు, గ్రామీణ భారతదేశంలోని వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వానికి జీవితం పోస్తున్నాయి.
వింత ఆచారం.. అక్కడ వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి!
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో వింత ఆచారం
దరిమడుగు గ్రామానికి చెందిన గుమ్మా వెంకటనారాయణ, గంగమ్మల కుమారుడు నాగార్జునకు యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రతో వివాహం
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం… pic.twitter.com/cmRhnC760u
— BIG TV Breaking News (@bigtvtelugu) August 3, 2025