KCR To Launch National Party In Hyderabad?
KCR : రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ముందే ఊహించడం కష్టం. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ అలాగే బీజేపీ నుంచి పోటీ వుండొచ్చుగానీ, గులాబీ పార్టీ గెలుపుకు వచ్చిన డోకా ఏమీ వుండదనిపించడం సహజమే. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్నీ, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల పలితాల్నీ, 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల్నీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూడటం ఎంతవరకు సబబు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 8 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీయార్ కూడా ఆ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసక్తికరమైన రీతిలో విమర్శలు చేశారు. నిజానికి, ఇలాంటి వేదికలపై కేసీయార్, రాజకీయ విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించి వుండరు. అయితే, కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు. అంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారాయన. తెలంగాణ అవతరణ దినోత్సవం నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలందరిలోనూ సెంటిమెంట్ బలంగా వుంటుంది. ఈ సమయంలోనే, రాష్ట్ర సమస్యల్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్న వైనాన్ని కేసీయార్ ప్రస్తావిస్తే, ఆ ఇంపాక్ట్ తెలంగాణ ప్రజల మీద ఎక్కువగా, ఎక్కువకాలం వుండి తీరుతుంది.
పోలవరం ప్రాజెక్టు కోసమంటూ ఖమ్మం జిల్లాలోని కొంత భూభాగాన్ని, ఆంధ్రప్రదేశ్‌కి అప్పగించడం సహా అనేక అంశాల్ని కేసీయార్ ప్రస్తావించారు.
Isn’t so easy for KCR in Telangana
కేంద్రం, తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తోందనీ అన్నారు. దేశానికి తెలంగాణ దిశా నిర్దేశం చేస్తుందనీ, అది ఓర్వలేక తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. దేశం పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని కూడా కేసీయార్ ఆరోపించారు. కేసీయార్ నుంచి వచ్చిన ఒక్కో మాటా నిజంగానే తూటాలా పేలింది. ఇదంతా వచ్చే ఎన్నికల్ని లక్ష్యంగా పెట్టుకుని కేసీయార్ అమలు చేసిన వ్యూహమే. అయితే, వరుసగా రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ముమ్మాటికీ ఏదైనా మ్యాజిక్ జరిగి తీరాల్సిందే. అది చేయగల సత్తా కేసీయార్‌కి వుందిగానీ.. టైమ్ ఎప్పుడూ ఒకే వైపు వుంటుందని అనుకోవడం కూడా పొరపాటే.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.