jabardasth anasuya and rashmi to act in web series
Jabardasth : జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ అంటేనే యాంకర్ అనసూయ. ఆమె కోసమే జబర్దస్త్ ను చూసేవాళ్లు కోకొల్లలు. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అయితే యాంకర్ రష్మీ. ఇద్దరూ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రెండు కళ్లలాంటి వాళ్లు. వీళ్లిద్దరు లేకుండా అసలు జబర్దస్తే లేదు. యాంకర్ సుమ తర్వాత బుల్లితెర మీద అంతటి క్రేజ్ ఉన్నది వీళ్లకే. ఇక.. జబర్దస్త్ లో వీళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు.
jabardasth anasuya and rashmi to act in web series
యాంకర్ అనసూయ మాత్రం తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడితే.. యాంకర్ రష్మీ కూడా తన పొట్టి పొట్టి డ్రెస్సులకు కుర్రకారుకు కనువిందు చేస్తుంది. ఇద్దరూ యాంకర్లుగా మాంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ.. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు అనే వార్తలు చాలా రోజుల నుంచి వింటున్నాం. జబర్దస్త్ లో ఫస్ట్ యాంకర్ గా అనసూయను తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత పేమెంట్ విషయంలో అనసూయ తప్పుకోగా.. రష్మీని తీసుకొచ్చారు. అప్పటి నుంచి యాంకర్ అనసూయ, రష్మీకి పడదు అనేది టాక్. నిజానికి.. తెర మీద కానీ.. ఏవైనా షోలలో కానీ.. బయట కలిసినప్పుడు కానీ.. ఇద్దరూ తెగ మాట్లాడేసుకుంటారు. కానీ.. లోపల మాత్రం బాగానే ఉందట.
అయితే.. బుల్లి తెర సిస్టర్స్ గా ఉన్న వీళ్లు.. నిజంగానే తమ మధ్య ఎటువంటి వైరం లేదని నిరూపించే ప్రయత్నం చాలా సార్లు చేశారు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు స్కిట్స్ కూడా చేశారు. ఇద్దరూ ఒకరి మీద మరొకరు జోక్స్ కూడా వేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్ లో ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. దాన్ని నిర్మించేది కూడా మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లేనట. వాళ్లే.. జబర్దస్త్ షోను కూడా నిర్వహించేది. ఇప్పుడు ఇద్దరు యాంకర్లను కలిపి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ కథ కూడా ఫైనల్ అయిందట. జులైలో షూటింగ్ మొదలవుతుందట. చూద్దాం మరి.. ఇద్దరు బుల్లితెర సిస్టర్స్ ఎలా వెండి తెర మీద అలరిస్తారో?
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.