jabardasth sudigali sudheer marriage fixed
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర మీద ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. సుడిగాలి సుధీర్ అంటే ఓ బ్రాండ్. ఇక.. సుధీర్ అనగానే మనకు గుర్తొచ్చే మరో పేరు యాంకర్ రష్మీ. ఇద్దరిదీ విడదీయలేని బంధం. అందుకే.. సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఆన్ స్క్రీన్ మీద మాంచి క్రేజ్ ఉంది. ఏది ఏమైనా.. బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ తర్వాతనే ఎవరైనా. ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూల్ది కాదు. సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి, ఆయన లవ్ గురించి, రష్మ, సుధీర్ గురించి.. ఇక వీటి గురించే సోషల్ మీడియాలో చర్చ, రచ్చ.సుడిగాలి సుధీర్.. వయసు అయిపోతున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని.. రష్మీతో తనకు లవ్ ఉందని.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని ఆమధ్య వార్తలు తెగ వచ్చాయి.
jabardasth sudigali sudheer marriage fixed
కానీ.. అవన్నీ ఉత్తుత్తే అని తేలింది. చాలా సందర్భాల్లో రష్మీ కూడా తమ మధ్య ఏం లేదని చెప్పింది. సుధీర్ కూడా అదే చెప్పాడు. ఇద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని సుధీర్ కూడా చెప్పుకొచ్చాడు. నిజానికి.. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ.. అది ఉత్తదే అయిపోయింది.
అయితే.. పెళ్లిపై సుడిగాలి సుధీర్ అభిప్రాయం ఇంకోలా ఉంది. తనకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటున్నాడు సుధీర్. తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ సింగిల్ గానే ఉండిపోవాలని ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ.. మా ఇంట్లో వాళ్లు అస్సలు ఊరుకోవడం లేదు. ఎలాగైనా నాకు పెళ్లి చేయాలని ప్రాణం తీస్తున్నారు. కానీ.. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ.. అని చెబుతున్నాడు సుధీర్. కాకపోతే నాకు ఆ ఆమ్మాయి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అటువంటి అమ్మాయి దొరికితే నేను ఆలోచిస్తాను.. అంటూ సుడిగాలి సుధీర్ చెప్పగా.. ఎలాగైనా మా వాడికి త్వరలోనే పెళ్లి చేస్తాం. త్వరలోనే అమ్మాయి ఎవరో కూడా చెబుతాం.. అంటూ సుధీర్ తండ్రి చెప్పుకొచ్చారు. ఫాదర్స్ డే స్పెషల్ ఈవెంట్ సందర్భంగా సుడిగాలి సుధీర్.. తన తండ్రితో వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు.. తన తండ్రి ఎలాగైనా పెళ్లి చేస్తామని చెప్పుకొచ్చారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.