జబర్దస్త్ ఇమ్మూ, వర్ష ప్రేమకు యాంకర్ సుమ పరీక్ష.. అలా అందరిముందు చేయాలంటూ సవాల్?
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. జబర్దస్త్ లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిజానికి.. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ జంటకు బుల్లితెర మీద ఎంత క్రేజ్ ఉందో.. అంత కంటే ఎక్కువ క్రేజ్ ఇమ్మాన్యుయయేల్, వర్ష జంటకు ఉంది. అవును.. ఒక మోడల్ గా, సీరియల్ నటిగా ఉన్నంత కాలం.. అసలు వర్షకు గుర్తింపే రాలేదు. ఇమ్మాన్యుయేల్ కు కూడా […]
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. జబర్దస్త్ లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిజానికి.. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ జంటకు బుల్లితెర మీద ఎంత క్రేజ్ ఉందో.. అంత కంటే ఎక్కువ క్రేజ్ ఇమ్మాన్యుయయేల్, వర్ష జంటకు ఉంది. అవును.. ఒక మోడల్ గా, సీరియల్ నటిగా ఉన్నంత కాలం.. అసలు వర్షకు గుర్తింపే రాలేదు. ఇమ్మాన్యుయేల్ కు కూడా అంతే.
ఎప్పుడైతే.. ఇద్దరూ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారో.. ఈ జంటకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. బుల్లితెర మీద, ఆన్ స్క్రీన్ మీద ఒక్కటైన ఈ జంట.. నిజంగా కూడా ప్రేమలో పడిందట. బయట కూడా ఇద్దరూ కలిసి తిరగడం, వాళ్ల ప్రవర్తనను చూసి.. నో డౌట్.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు అని నెటిజన్లు కన్ఫమ్ చేసేశారు. జబర్దస్త్ స్టేజ్ మీద కూడా వర్ష.. ఇమ్మూ మీద తనకు ఉన్న ప్రేమను వ్యక్త పరిచింది.
స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొన్న ఇమ్మూ, వర్ష
అయితే.. తాజాగా ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరూ స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొన్నారు. ఆ షోకు యాంకర్ సుమ. ఇక ఆమె గురించి తెలిసిందే కదా. ఇద్దరిని అడ్డంగా బుక్ చేయాలని ప్లాన్ చేసినట్టుంది. అందుకే.. వీళ్లకు ఒక అగ్ని పరీక్ష పెట్టింది సుమ. అసలు మీరిద్దరూ లవర్సేనా. నాకు డౌటే. మీరు నిజంగా లవర్స్ అనే విషయం ఇప్పుడు బయట పడాలి. ఇది నిజమా? అబద్ధమా? అని తేల్చేటువంటి ఒకే ఒక పరీక్ష. ఇమ్మూ.. వర్ష బుగ్గ మీద ముద్దు పెట్టాలి.. అంటూ అనే సరికి.. ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్నవాళ్లందరూ షాక్ అయ్యారు. ఈ షోకు వచ్చిన మిగితా జబర్దస్త్ కంటెస్టెంట్లు కూడా షాక్ కు గురయ్యారు.
అయితే.. వర్ష మాత్రం.. యాంకర్ సుమ మాటలకు తెగ సిగ్గుపడిపోయింది. ఇమ్మాన్యుయేల్ అయితే నేను రెడీ అనేశాడు. పెళ్లి కూతురులా తల కిందికి పెట్టుకొని సిగ్గుపడుతున్న వర్ష దగ్గరికి వెళ్లి.. ముద్దు పెట్టబోతుండగా.. వెంటనే మిగితా జబర్దస్త్ కమెడియన్లు.. ఆపు.. ఆపు.. అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం స్టార్ మాలో ప్రసారమయ్యే స్టార్ట్ మ్యూజిక్ షోను చూడాలి.. అంటూ పెద్ద బాంబు పేల్చారు. ఇంతకీ ఇమ్మూ.. వర్షకు ముద్దు పెట్టాడంటారా? ఏమో ఎవడికి తెలుసు. ముందైతే ఈ ప్రోమోను చూసేయండి.
https://www.instagram.com/p/CPve7iUli2j/