Jabardasth Varsha : ఇమ్మూకు వేరే పెళ్లి అయితే తట్టుకోలేను.. గుక్క పెట్టి ఏడ్చేసిన వర్ష.. స్టేజ్ మొత్తం ఒక్కసారి సైలెంట్?
Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష తెలుసు కదా. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. జబర్దస్త్ వర్షతో పాటు.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కూడా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఇద్దరూ కలిసి ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ ను ఊపేస్తున్నారు. ఈ జంటకు ఆన్ స్క్రీన్ మీద ఉన్న పాపులారిటే వేరు. అందుకే.. వీళ్లు ఎక్కడుంటే.. ఆ షో హిట్టే. ఏదో ఆన్ స్క్రీన్ మాత్రమే వీళ్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడం లేదు. ఇద్దరి మధ్య నిజంగా ఏదో ఉందట. అందుకే.. ఇద్దరి కెమిస్ట్రీ సరిగ్గా వర్కవుట్ అవుతోందని అంటున్నారు.

jabardasth varsha and immanuel in extra jabardasth
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరూ బాగా కనెక్ట్ అయిపోయారు. ఇద్దరూ కలిసి స్కిట్ చేయడమే కాదు.. చాలా సార్లు ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద తమ మధ్య ఉన్న ప్రేమ గురించి కూడా చెప్పుకొచ్చారు. దీంతో వీళ్లిద్దరు ఇక ఎలాగైనా పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయ్యారు.

jabardasth varsha and immanuel in extra jabardasth
Jabardasth Varsha : ఒక్కసారిగా భావోద్వేగానికి గురయిన జబర్దస్త్ వర్ష?
వర్ష, ఇమ్మాన్యుయేల్ తాజా ఎపిసోడ్ లో పెళ్లి స్కిట్ చేస్తున్నారు. హడావుడిలో ఇమ్మాన్యుయేల్.. వర్షకు తాళి కట్టకుండా.. తన చెల్లికి కడుతాడు. దీంతో వర్ష ఒక్కసారిగా షాక్ అవుతుంది. స్కిట్ లో షాక్ అయితే పర్లేదు కానీ.. ఒకవేళ నిజంగా ఇమ్మాన్యుయేల్ కి వేరే అమ్మాయితో పెళ్లి అయితే ఏం చేస్తావు.. అని జడ్జి రోజా.. వర్షను అడిగేసరికి.. వర్షకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడ్చేసింది.

jabardasth varsha and immanuel in extra jabardasth
మనకు నచ్చినవాళ్లు వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటే.. ఎలా ఉంటాం మేడం. తట్టుకోలేం మేడం.. అంటూ తన నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. గుక్క పెట్టి మరీ ఏడ్చేసింది వర్ష. వర్ష ఏడ్వడం చూసి.. ఇమ్మాన్యుయేల్ కూడా కంట తడి పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమను స్టేజ్ మీదనే చూపించేసరికి.. అక్కడ ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి.
