RBI | కొన్ని సహకార బ్యాంకులపై ఆర్బీఐ భారీ చర్యలు.. నిబంధనల ఉల్లంఘనలకు తగిన శిక్ష
RBI | దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల నిఘా కట్టుదిట్టం చేస్తోన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి పలు సహకార బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ చట్టాన్ని ఉల్లంఘించడం, ఆర్బీఐ మార్గదర్శకాల అమలులో లోపాలు, పలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంలాంటివి కారణంగా మొత్తం ఐదు బ్యాంకులకు జరిమానాలు విధించినట్లు RBI అధికారికంగా ప్రకటించింది.

#image_title
అజాగ్రత్త వద్దు..
మహారాష్ట్రలోని ఈ బ్యాంకు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, సెక్షన్ 26A ఉల్లంఘనకు పాల్పడిందని RBI తెలిపింది. నో యువర్ కస్టమర్’ (KYC) మార్గదర్శకాలను పాటించకపోవడం, అలాగే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEA ఫండ్) కి కేటాయించాల్సిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను సరైన సమయంలో బదిలీ చేయకపోవడం కారణంగా ఈ జరిమానా విధించబడింది.
ముంబై కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకు, సైబర్ భద్రతకు సంబంధించిన అసాధారణ సంఘటనలను RBIకి నివేదించడంలో విఫలమైంది. అలాగే జలగావ్ డీసీసీ బ్యాంక్ – ₹3.50 లక్షల ఫైన్, యావత్మాల్ డీసీసీ బ్యాంక్ – ₹1 లక్ష ఫైన్ ,అహ్మదాబాద్ మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ – ₹23,000 జరిమానా విధించారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణ అత్యవసరం అని అర్ధమైంది. ప్రతి ఆర్థిక సంస్థ తప్పనిసరిగా RBI జారీ చేసే మార్గదర్శకాలను నిర్దిష్టంగా పాటించాల్సిందే. అంతే కాకుండా, నిబంధనలు విస్మరించే సంస్థలపై ఆర్థిక జరిమానాలతో పాటు, అవసరమైతే లైసెన్స్ రద్దు* వంటి తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవచ్చని హెచ్చరించింది.