Janaki Kalaganaledu 18 Aug Today Episode : జానకి కలగనలేదు 18 ఆగస్టు 2021, బుధవారం ఎపిసోడ్ 108 రిలీజ్ అయింది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏం ఇప్పుడు చూద్దాం. రాత్రి అయినా కూడా జానకి ఖార్ఖానాలో లేకపోవడంతో.. మల్లికకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. పోలేరమ్మను డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ల బండారం బయటపెట్టాలని మల్లిక అనుకొని మళ్లీ ఇంటికి వెళ్తుంది. ఇంతలో రామా, జానకి బైక్ మీద ఖార్ఖానాకు వస్తుంటారు. బైక్ మధ్యలో ఆపి.. ఏమైందండి.. అలా ఉన్నారు జానకి గారు.. అంటాడు రామా. నేనెందుకు బాధపడతాను అండి. నేను ప్రతిక్షణం సంతోషంగా ఉండే బహుమతిని మా ఆయన నాకు ఇచ్చారు. ఆ ఆనందంలోనే మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తోంది అని చెబుతుంది జానకి.
కేవలం మూడు ముళ్ల బంధానికి విలువ ఇచ్చి నేను ఎవరో తెలియకపోయినా.. నన్ను నమ్మి వచ్చారు. నన్ను అంతలా నమ్మి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి. మీ కంట్లో కన్నీరు చుక్క వచ్చినా.. నేను భర్తగా ఓడిపోయినట్టే. మిమ్మల్ని నేను అస్సలు ఓడిపోనివ్వను.. అని అంటాడు రామా.
నా భర్త నా మీద చూపిస్తున్న ప్రేమకు ఓవైపు సంతోషంగానే ఉన్నా.. మరోవైపు బాధగా ఉంది. ఖార్ఖానాలో ఉన్నన్ని రోజులు మీరు నాతో మాట్లాడకూడదని అత్తయ్య గారు చెప్పారు. అదే నాకు భయం వేస్తోంది. నేను 5వ తరగతి వరకే చదువుకున్నా.. అని అత్తయ్య అనుకుంటున్నారు. కానీ.. నేను డిగ్రీ చదివిన విషయం తెలిస్తే… తను ఏం చేస్తుందో ఏమో? అంటుంది జానకి.
నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా. నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తా పదా. అక్కడికి వెళ్తే నువ్వు ఫుల్ టు సంతోషంగా ఉంటావు అని చెప్పి తనను ఓ ప్లేస్ వద్దకు తీసుకెళ్తాడు. ఇక్కడ ఆపారు ఏంటండి.. అని అడుగుతుంది జానకి. ఒకసారి అటు చూడండి.. అంటాడు రామా. రండి.. మీకు భయం పోగొట్టే ప్లేస్ ఇది. చాలా మహిమ కల అమ్మవారు. మనం కోరుకునే కోరికలను ఇట్టే తీర్చేస్తారు. మీలో భయం పోయి.. మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐపీఎస్ పాస్ అవ్వాలని ఈ అమ్మవారిని వేడుకోండి.. అని చెబుతాడు రామా.
అమ్మ.. నా కల నాకు సొంతం అయ్యేలా చేయడం కోసం ఆయన చాలా ఆరాటపడుతున్నారు. దాని కోసమే.. వాళ్ల అమ్మగారి నిర్ణయాన్ని దాటి ముందుకు వస్తున్నారు. దాని వల్ల వాళ్ల అమ్మగారితో ఎన్ని సమస్యలు వస్తాయో ఏమో. నా కారణంగా.. వాళ్ల అమ్మగారి ముందు ఆయన దోషిగా నిలబడకూడదు. తల్లీకొడుకుల మధ్య నా వల్ల ఎలాంటి అపార్థాలు రాకుండా చూడు అమ్మ.. అని జానకి దేవతను వేడుకుంటుంది.
అమ్మా.. ఏ ఆడపిల్ల అయినా తనకంటే బాగా చదువుకున్న వాడిని మంచి ఉద్యోగం చేస్తున్న వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ.. నా భార్య మాత్రం నేను పెద్దగా చదువుకోలేదని.. స్వీట్లు అమ్ముకుంటానని తెలిసి కూడా తన ఐపీఎస్ ఇష్టాన్ని చంపుకొని నాతో ఏడడుగులు నడిచింది. మరి అలాంటి భార్యకు తను కన్న కలలు అందివ్వకపోతే భర్తగా నాకు అర్థం ఏముంది చెప్పు. అమ్మ.. నా కారణంగా తన కలను దూరం చేసుకోవద్దు. అందుకే .. నా భార్య కష్టపడి చదివి ఐపీఎస్ అయ్యేలాగా ఆశీర్వదించు అమ్మా.. అంటూ వేడుకుంటాడు రామా.
జానకి గారు.. కూర్చోండి.. అని చెబుతాడు. అక్కడ కాసేపు ఇద్దరూ కూర్చుంటారు. జానకి గారు తీసుకోండి అని ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. మీరు ఏదో ఒక పరీక్షలో టాప్ లో పాస్ అయ్యారు అని చెప్పారు కదండి. ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత అసలు సిసలైన పరీక్ష పెడతారు అట కదండి.. దాంట్లో మంచి ర్యాంకు వస్తేనే మీరు ఐపీఎస్ అవుతారంట కదా. దానికి అప్లికేషన్ పెట్టే ఫామ్ అన్నమాట. తీసుకోండి.. అంటాడు రామా.
ఈ విషయం మీకు ఎలా తెలుసండి.. అని జానకి అనగానే.. ఏమండి.. నా భార్య ఇష్టం తెలుసుకున్నాక.. తను ఏం చేయాలో నాకు తెలియదా? ముందు మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ను తీసుకెళ్లి అమ్మవారి దగ్గర ఉంచండి. మీరు ఐపీఎస్ అయిపోయినట్టే.. అని రామా అంటాడు.
ఫామ్ ను నింపమని.. ఓ పెన్ తీస్తాడు. కానీ.. తనకు ఓ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆ పెన్ ఓ వ్యక్తి తన కూతురుకు గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్తుండగా… అతడు యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఆ పెన్నును తీసుకొని రామా తన దగ్గర ఉంచుకొని దాన్ని జానకికి ఇస్తాడు. ఈ పెన్ను ఎవరిదండి.. దీని మీద కూడా జే.. అనే అక్షరం ఉంది. అంటే.. జానకి.. నా పేరులోని మొదటి అక్షరం అని అడుగుతుంది జానకి. ఆ పెన్ను ఎవరిదో కాదు.. మీ నాన్నగారిదే. ఆయన నీకొసం కొన్నదే అని అంటాడు రామా. దీంతో షాక్ అవుతుంది జానకి. మా నాన్నగారు మీకెలా తెలుసు.. అని అడుగుతుంది జానకి.
ఒకే ప్రయాణంలో కలిసి.. అదే ప్రయాణంలో ఎప్పటికీ అందలేనంత దూరం వెళ్లిపోయినంత పరిచయం. ఆరోజు పడవ ప్రయాణం జరిగినప్పుడు మీ అమ్మానాన్నలతో పాటు నేను కూడా ఉన్నాను. కూతురంటే ఆయనకు పంచప్రాణాలు. ఆ ప్రమాదం నుంచి మీ తల్లిదండ్రులను కాపాడటానికి.. నేను చాలా కష్టపడ్డాను. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాం. కానీ.. మీ అమ్మానాన్నను బతికించుకోలేకపోయాం. మీ నాన్న గారు నా చేతుల్లోనే ప్రాణాలు వదిలారు. ఆ పెన్నును కూడా నాకోసం వదిలారు. అది మా అమ్మకోసం కొన్న పెన్ను. కానీ.. మీ నాన్నగారు కావాలంటే ఇచ్చాను. ఆయన కన్న కలలను నేను నిజం చేయకుండా ఎలా ఉంటాను జానకి గారు.. అంటూ చెబుతాడు రామా.
నేనంటే తాళి కట్టిన భార్య కాబట్టి… నాకోసం ఇదంతా చేస్తున్నారని అనుకున్నా కానీ.. ముక్కు మొహం తెలియని మా అమ్మనాన్న కోసం అంత కష్టపడ్డారంటే మీరు దేవుడు కాకపోతే ఇంకేంటండి. మీ కన్నవాళ్లు ఎవరో తెలిసాకనే నా బాధ్యత ఏంటో నాకు అప్పుడే తెలిసింది. అయ్యో జానకి గారు ఎంత అంటే చెప్పలేకపోవచ్చు.. ఎలా అంటే నిరూపించలేకపోవచ్చు. కానీ.. ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నేను మీకు అండగా ఉంటానండి.. అని రామా అంటాడు.
పెళ్లి పేరుతో నా కలను చెరిపేశారని నేను చాలా బాధపడ్డా కానీ.. ఎన్ని జన్మలు ఎత్తినా దొరకని భర్త దొరికారు. నేను చాలా అదృష్టవంతురాలిని అండి.. అని చెబుతూ రామా కౌగిట్లో వాలిపోతుంది జానకి.
కట్ చేస్తే.. మల్లిక… పోలేరమ్మ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటుంది. కానీ.. జ్ఞానాంబ ఇంకా ఇంటికి రాదు. అప్పుడే కారులో వస్తుంటుంది జ్ఞానాంబ. వెంటనే కారు ఆపి.. అత్తయ్య గారు డోర్ తీయండి.. అంటూ అరుస్తుంది.. ఏంటి విషయం అంటుంది. ఏమైందో చెప్పు అంటుంది.
బావ గారు… జానకి గారు కలిసి మీ మాటను, మీ నిర్ణయాన్ని మంటల్లో కలిపేశారు అండి.. అంటుంది మల్లిక. మొత్తం చెబుతుంది. నువ్వు చెప్పేది నిజమేనా.. అని అడుగుతుంది జ్ఞానాంబ. నేను చెప్పేది నమ్మకపోతే.. ఖార్ఖానాకు రండి.. మీరే చూద్దురు కానీ.. అని అంటుంది మల్లిక. ఖార్ఖానాకు జ్ఞానాంబను తీసుకొస్తుంది మల్లిక.
ఇంతలో జానకి, రామా.. ఖార్ఖానాకు బయలుదేరుతారు. వాళ్లు సాయంత్రమే వాళ్లు బయటికి వెళ్లారంట అత్తయ్య గారు అని మల్లిక జ్ఞానాంబకు చెబుతుంది. ఇంతలోనే రామా, జానకి ఖార్ఖానా డోర్ తీస్తారు. దీంతో జ్ఞానాంబ డోర్ ముందు నిలబడి ఉంటుంది. జ్ఞానాంబను చూసి ఇద్దరూ షాక్ అవుతారు.
అమ్మ.. అది అని రామా చెబుతుండగానే… మీరు చెప్పడం అయిపోయింది. ఇక నేను చెప్పేది వినండి. ఉదయాన్నే ఇంటికి రండి. అక్కడే నా నిర్ణయం చెబుతా.. అని చెప్పి జ్ఞానాంబ వెళ్లిపోతుంది. ఉదయమే తను ఏం నిర్ణయం చెబుతుందో తెలుసుకోవాలంటే మాత్రం గురువారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.