Janaki Kalaganaledu 23 Aug Today Episode : మల్లికకు పెద్ద షాక్ ఇచ్చిన జ్ఞానాంబ.. ఆ తాంబాలంలో ఏం పట్టుకొని వచ్చిందో చూసి.. ఆశ్చర్యపోయిన రామా, జానకి.. జ్ఞానాంబ రూటే సపరేట్?

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

Janaki Kalaganaledu 23 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 23 ఆగస్టు 2021, సోమవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 111 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జానకిని కాలేజీ పక్కనున్న గుడికి తీసుకెళ్లాను కానీ.. కాలేజీకి కాదు అంటాడు రామా. జానకి గారి నాన్న పుట్టిన రోజు కావడంతో.. ఆ ఊరు గుడిలో.. వాళ్ల నాన్న పేరు మీద పూజ చేయించాలని జానకి మొక్కుకున్నది అని చెప్తాడు రామా. మరి… మాకెందుకు ఈ విషయం చెప్పలేదు.. అని అడుగుతుంది జ్ఞానాంబ. తను నాకు కూడా చెప్పలేదు ఈ విషయం. తను ఫోన్ లో చెప్పింది నాకు.. అని చెబుతాడు రామా.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

తను చాలా బాధపడుతూ.. నాకు ఫోన్ చేసింది అమ్మ. తను ఖార్ఖానాలో ఉంది కదా. తను బాధపడుతుంటే.. ఏమైంది… అని రెండు మూడు సార్లు అడిగితే.. అప్పుడు అసలు విషయం చెప్పింది. దీంతో తనను గుడికి తీసుకెళ్లాల్సి వచ్చింది.. అని రామా.. జ్ఞానాంబకు చెబుతాడు.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

Janaki Kalaganaledu 23 Aug Today Episode :  ఇంట్లోకి వెళ్లి తాంబాలం పట్టుకొని వచ్చిన జ్ఞానాంబ

తను ఆ విషయం చెప్పగానే.. వెంటనే ఇంట్లోకి వెళ్తుంది జ్ఞానాంబ. వెళ్లి ఒక తాంబాలం పట్టుకొని వస్తుంది. దాని మీద ఒక వస్త్రం ఉంటుంది. రామా దగ్గరికి వచ్చి.. మల్లిక ఇది అందరికీ ఇవ్వు.. అని అంటుంది. దీంతో మల్లిక షాక్ అవుతుంది. అసు.. అందులో ఏముంది అని చూడబోతుంది. ముందు అందరికీ ఇవ్వు.. అని బెదిరిస్తుంది జ్ఞానాంబ. దీంతో వస్త్రం తీసి చూస్తుంది. చూస్తే.. అందులో అన్నీ స్వీట్లు ఉంటాయి. మల్లికతో పాటు.. జానకి, రామా అందరూ షాక్ అవుతారు. స్వీట్లు ఉన్నాయేంటి.. అని ఆశ్చర్యపోతుంది మల్లిక. అందరికీ ఇవ్వు.. స్వీట్లు అనగానే.. సరే అని అందరికీ ఇస్తుంది మల్లిక.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

అత్తయ్య గారు అందరికీ ఇచ్చేశాను. కానీ.. ఎందుకు పంచమన్నారో కారణం చెబుతారా? అని జ్ఞానాంబను అడుగుతుంది మల్లిక. ఇచ్చింది తినమని.. చూస్తూ ఉండమని కాదు.. తినండి.. అని బెదిరిస్తుంది జ్ఞానాంబ. దీంతో అందరూ గబగబా స్వీట్లను తింటారు. ఇంతలో జ్ఞానాంబ ఒక నవ్వు నవ్వుతుంది. చప్పట్లు కొడుతుంది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక.. అందరూ తనతో పాటు చప్పట్లు కొడతారు. జానకికి మాత్రం అస్సలు ఏం అర్థం కాదు.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

Janaki Kalaganaledu 23 Aug Today Episode : రామా, జానకి.. ఇద్దరినీ దగ్గరికి తీసుకున్న జ్ఞానాంబ

దగ్గరికి రాఅమ్మా.. అని పిలుస్తుంది జ్ఞానాంబ. అత్తారింటికి వచ్చిన ఆడపిల్లకు తను ఒంటరి అనే బాధ అస్సలు ఉండకూడదు. భర్త అర్థం చేసుకుంటాడా.. అనే ఆలోచనే లేదు. తన బాధను అర్థం చేసుకొని నువ్వు తనను గుడికి తీసుకెళ్లావు.. ఈ అమ్మ నిర్ణయాన్ని దాటినందుకు బాధగా ఉన్నా.. నిన్ను నమ్ముకొని వచ్చిన భార్య కన్నీళ్లు తూడ్చినందుకు నాకు గర్వంగా ఉంది.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

నాన్నా.. ఒకవేళ నా మాటకు భయపడి నువ్వు ఆగిపోయి ఉంటే.. నా కారణంగా నా కోడలు కన్నీళ్లు పెట్టుకునేది అని నేను బాధపడేదాన్ని. నా కొడుకును చూస్తే ఎంత ముచ్చటేస్తుందో.. అంతకంటే ఎక్కువ గర్వంగా ఉంది. ఈ అమ్మ దృష్టిలో నువ్వు ఇంకా ఎదిగిపోయావు నాన్నా.. అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

దీంతో మల్లిక తెగ బాధపడిపోతుంది. తనకు అస్సలు అర్థం కాదు.. ఏం జరుగుతోంది అని తెగ టెన్షన్ పడుతుంది. తన ప్లాన్ అంతా తుస్సు అయిందే అని తెగ బాధపడిపోతుంది. ఏడ్వడం ఒక్కటే తక్కువ తనకు. ఇక.. రామా, జానకికి కూడా జ్ఞానాంబను హత్తుకుంటారు.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

నేను ఒకటనుకుంటే మరొకటి అయింది. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది.. అంటూ ఏడ్చేస్తుంది మల్లిక. జిలేబి తింటూ తన ఏడుపును అలాగే కంటిన్యూ చేస్తుంది.

Janaki Kalaganaledu 23 Aug Today Episode : అత్తయ్య గారికి అబద్ధం ఎందుకు చెప్పారంటూ రామాను ప్రశ్నించిన జానకి

కట్ చేస్తే.. జానకి, రామా.. తమ రూమ్ లోకి వెళ్తారు. ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. మీరు కాలేజీకి వెళ్లారా? అని అమ్మ అడగగానే.. ఎక్కడ అమ్మకు నిజం తెలిసిపోతుందోనని తెగ భయపడ్డాను.. అని అంటాడు రామా. మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? మా నాన్న పుట్టిన రోజు కోసం గుడికి వెళ్లామని మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? అని అడుగుతుంది జానకి.

దీంతో.. అలా చెప్పకపోతే.. మనం ఇప్పటికే గుమ్మం దాటి ఉండేవాళ్లం.. అని అంటాడు రామా. మీ నాన్న గారిని ఇందులో తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి.. అంటాడు రామా. మా నాన్న గారి గురించి ప్రస్తావన వచ్చినందుకు కాదు కానీ.. ఇలా ఇంకా ఎన్నేళ్లు అబద్ధం ఆడుతూ ఉందాం. అబద్ధం అనేది పులి మీద స్వారీ లాంటిది.. అని అంటుంది జానకి.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

తప్పదు జానకి గారు.. మీ లక్ష్యం నెరవేరే వరకు ఇలాంటి ఎన్ని అబద్ధాలు అయినా ఆడాల్సి వస్తుంది. మీరు ఐపీఎస్ అయ్యేవరకు.. ఇలాగే ఉండాలి. తప్పదు.. అని అంటాడు రామా.

కొడుకు, కోడలు ప్రేమగా ఉంటే ఓర్చుకోలేని అత్తలు ఉన్నారు ఈ రోజుల్లో. కోడలు సంతోషం కోసం.. తన మాటను వినకపోయినా పర్వాలేదు అని అంటున్నారు అత్తయ్య గారు. అందుకే జానకి గారు మా అమ్మ అంటే అంత ఇష్టం.. అంత గౌరవం.. అని రామా అంటే.. అంత గొప్ప మనిషికి కోడలును అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. అందుకే.. మనం చెప్పే అబద్ధాలు రేపు అత్తయ్య గారికి ఇబ్బంది కలిగించకూడదు.. అని అంటుంది జానకి.

Janaki Kalaganaledu 23 Aug Today Episode :  దిగాలుగా కూర్చున్న మల్లిక

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

కట్ చేస్తే.. ఏదో కోల్పోయిన మనిషిలా.. దిగాలుగా కూర్చుంటుంది మల్లిక. చికిత వచ్చి తనను హేళన చేస్తుంటుంది. దీంతో అక్కడే ఉన్న పిండిని తీసుకొని తన మొహం మీద కొడుతుంది మల్లిక. ఏంటండి.. ఏదో పాట పాడుతున్నారు పాడండి.. మేడం.. అదేంటిది.. కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్.. ఇంకోసారి ఎదవ పాటలు పాడావంటే తోలు తీస్తాను… అని అంటుంది మల్లిక.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

ఇంతలోనే జానకి రెడీ అయి.. ఒక సంచి పట్టుకొని ఎక్కడికో వెళ్తుంది. తనను చూసిన మల్లిక.. ఈ మేడమ్ గారు ఎక్కడికి వెళ్తోంది.. అని అనుకుంటుంది. ఇంతలో జ్ఞానాంబ.. తనను చూసి జానకి ఎక్కడికి వెళ్తున్నావు.. అని అడుగుతుంది. ఖార్ఖానాకు.. ఈరోజు చివరి రోజు కదా.. అక్కడికి వెళ్లి పనులన్నీ చేస్తాను. మీరు వీలు కుదిరినప్పుడు వచ్చి పనులు చూడండి.. అని అంటుంది. నువ్వు పనులు నేర్చుకుంటావని తెలుసు.. కొందరిలా పనిదొంగవు కాదని కూడా తెలుసు.. అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

Janaki Kalaganaledu 23 Aug Today Episode : జ్ఞానాంబను పొగిడేసిన జానకి

అత్తయ్య.. ఈ ఇంట్లో మొదట్లో నాకు చిన్న బెరుకు ఉండేది. ప్రతి విషయంలో మీరు చూపించే శ్రద్ధతో ఆ బెరుకు కొంచెం కొంచెం పోయింది. ఈరోజుతో అది మొత్తం పోయింది. అత్తయ్య అంటే.. కోడళ్లను సాధిస్తారు అంటారు. కానీ.. మిమ్మల్ని చూస్తే అదంతా పోయింది. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. అత్తయ్య. ఇంత గొప్ప అత్తయ్య దొరకడం.. నా అదృష్టం.. అని అంటుంది జానకి.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

ఇంతలో మధ్యలో దూరి.. అత్తయ్య గారు.. నేను కూడా అత్తయ్య గారు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో.. మీకు కోడలిని అయ్యాను.. అని అనగానే.. నక్క వినయం ఆపి.. కోడలు అంటే ఎలా ఉండాలో జానకిని చూసి నేర్చుకో.. బాగుపడతావు.. అని అంటుంది జ్ఞానాంబ. సరే.. అత్తయ్య గారు అంటుంది మల్లిక.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

వెంటనే తన మొగుడు దగ్గరికి వెళ్లి.. నాకు ఉన్నాడు సన్నాసి మొగుడు.. దద్దమ్మ.. అంటూ తెగ తిట్టేస్తుంది. చూశారు కదా.. పప్పును ఒకలాగా.. పచ్చడిని ఒకలాగా.. అన్నట్టు ఎలా మీ అమ్మ మాట్లాడుతుందో చూశావు కదా. ఆవిడ గారు.. గీసిన గీతను.. రాసిన శాసనాన్ని వాళ్లు తుంగలో తొక్కేసినా సరే.. వాళ్లను ఒక్క మాట కూడా అనలేదు. అదే మనం అయి ఉంటేనా.. ఈపాటికి నన్ను పుట్టింటికి పంపించేంది తెలుసా? అంటుంది మల్లిక.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

నాకు ఈగో హర్ట్ అయింది. మనం ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మనం పట్నం వెళ్లాల్సిందే.. వేరే కాపురం పెట్టాల్సిందే.. అని అంటుంది మల్లిక. తను చెప్పినవన్నీ.. జానకి విని… మల్లిక ఎందుకు నా మీద నీకు ఇంత కోపం. నేను ఎప్పుడూ నిన్ను ఒక సొంత చెల్లిగానే చూశాను.. అంటుంది జానకి.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

Janaki Kalaganaledu 23 Aug Today Episode : మల్లికకు క్లాస్ పీకిన జానకి

మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటూ కూడా.. మీరు చాటుగా డబ్బులు దాచుకుంటున్నా సరే.. పర్లేదులే.. మన తమ్ముడే కదా.. అని ఆయన అన్నారు. అది ఆయన మనస్తత్వం. ఇలాంటి మంచి మనుషులను వదిలేసి.. వేరే ఉంటానంటావేంటి.. బుద్ధి లేకుండా.. అంటుంది జానకి.

janaki kalaganaledu 23 august 2021 monday 111 full episode

కట్ చేస్తే.. జానకికి రామా ఏదో సైగ చేస్తుంటాడు. అప్పుడు మల్లిక కూడా అక్కడికి వస్తుంది. జ్ఞానాంబ, తన భర్త కూడా అక్కడే ఊయలలో కూర్చొని ఉంటారు. తను చేసే సైగలు అస్సలు రామాకు అర్థం కావు. మొత్తం మీద రామా మాత్ర తన తల్లి దగ్గరకు వెళ్లి ఏదో చెప్పబోతుంటాడు. ఇంతలోనే సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. మంగళవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

5 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

6 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

8 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

9 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

10 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

11 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

12 hours ago