
TDP
ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అధికార పార్టీతో గట్టిగా తలబడి, నిలబడలేక, టీడీపీ కీలక నాయకులపై నమోదవుతున్న కేసులతో నానా అగచాట్లు పడుతోంది. ఇక మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు పార్టీలో కీలక నేతలు పార్టీపై వ్యక్తం చేస్తున్న అసంతృప్తి, అలకల పర్వం .. ఆ పార్టీ పెద్దలకు పెద్ద తలనెప్పిగా మారింది. అధినేత చంద్రబాబు పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించలేక, అధికార పార్టీతో యుద్ధం చేయలేక తిప్పలు పడుతున్నారు.
తాజా పరిణామాలకు లోకేష్ కూడా కారణం అన్న భావన చంద్రబాబును మరింతగా ఇబ్బంది పెడుతోందని సమాచారం. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సొంత పార్టీపై అలక వహించటం, సీనియర్లను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చెయ్యటం, అంతకు ముందు అచ్చెన్నాయుడు లోకేష్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు బయటకు వచ్చిన ఆడియోలు టీడీపీలో సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.
tdp
మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెదబాబు పట్టించుకోవటం లేదు.. కనీసం చినబాబైనా పట్టించుకోకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్న తీరు లోకేష్ పై తీవ్ర అసహనంలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో నారా లోకేష్ ను కీలకం చెయ్యాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలను పెద్దగా పట్టించుకోవటం లేదని, అన్ని నిర్ణయాలు లోకేష్ మీద వదిలిపెడితే లోకేష్ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా యూత్ ను ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా సీనియర్లలో ఆవేదన ఉంది
గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకతో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2014లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో కి తీసుకు వెళ్లడం లోనూ నాడు సీనియర్లు కీలకంగా వ్యవహరించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని, పార్టీలో క్రమంగా కీలక నేతగా లోకేష్ ఎదిగేలా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో క్రమక్రమంగా లోకేష్ నిర్ణయాలు పార్టీ సీనియర్ లలో అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ తర్వాత 2019లో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్ళ లేకపోవడం వెనుక లోకేష్ నిర్ణయాలు ఉన్నాయని పార్టీలో సైతం చర్చ జరిగింది.
లోకేష్ 2019లో టిడిపి ఓటమి పాలైందని అంతర్గతంగా కూడా సీనియర్ నాయకులలో అసహనం ఉంది. పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధినేత పార్టీపై దృష్టి పెట్టి సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సీనియర్ల నుండి డిమాండ్ వినిపిస్తోంది. పార్టీకి సీనియర్లు అవసరమే లేకపోతే పార్టీలో ఉండడం దేనికనే ప్రశ్నకూడా వినిపిస్తోంది. ఒకపక్క అధికార వైసీపీ ఇబ్బందులు పెడుతుంటే ఎదుర్కొంటూ, ప్రాధాన్యత లేకుండా పార్టీ ఉండటం అనవసరం అన్న భావన వ్యక్తం అవుతుంది. లోకేష్ ను పార్టీలో నాయకుడిగా ఎదిగేలా చేయాలన్న బాబు ఆలోచన, పార్టీని నాశనం చేస్తుంది అన్న అభిప్రాయం చాలామంది సీనియర్ల వ్యక్తమౌతుంది.
చంద్రబాబు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూనే లోకేష్ ని ఎదిగేలా చేయాలని కోరుతున్నారు. పార్టీని నమ్ముకుని అధికార పార్టీతో నిత్య సమరం చేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపడాలంటే తాజా అసంతృప్తి నేపథ్యంలోనైనా చంద్రబాబు రూట్ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో పార్టీ నేతల అసంతృప్తి పర్వం బాహాటంగా వ్యక్తమవుతున్న క్రమంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.