Janaki Kalaganaledu 9 Aug Today Episode : జానకి కలగనలేదు 9 ఆగస్టు 2021, 101 ఎసిసోడ్ తాజాగా విడుదలైంది. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మల్లికకు అస్సలు జ్ఞానాంబ పని చెప్పదు. దీంతో నాకు ఎందుకు అత్తమ్మ పని చెప్పడం లేదు.. అని తెగ ఆలోచిస్తుంది. ఇక జ్ఞానాంబ కోడలు కోసం వంటలు చేస్తుంది. తనకు తన భర్త కూడా సహకరిస్తుంటాడు. కోడలు అంటే అంత ఇష్టం ఉన్నదానివి ఎందుకు తనకు అంత శిక్ష వేశావు.. అంటూ ప్రశ్నిస్తాడు. హు.. అని అనగానే.. తన భర్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక.. ఖార్ఖానాలో జానికి ఎంత కష్టపడుతుందోనని ఆలోచిస్తుంటుంది జ్ఞానాంబ.
జానకి.. ఖార్ఖానాలో పని వాళ్లతో కలిసి కష్టపడి స్వీట్లు తయారు చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ టైమ్ కాగానే.. అందరూ అన్నం తినడానికి వెళ్తారు. కానీ.. జానకి మాత్రం వెళ్లదు. అమ్మ జానకి.. మీరు కూడా ఇంతలో ఇంటికి వెళ్లి అన్నం తిని రండి.. అని పనివాళ్లు చెబుతారు. దీంతో పర్లేదు.. నేను తర్వాత తింటాను.. అని చెబుతుంది జానకి. కాదమ్మా.. మీరు ఉదయం నుంచి అన్ని పనులు చేసి బాగా అలసిపోయారు. మీరు తినడం లేట్ అయితే సమస్య అవుతుంది అని పనివాళ్లు అంటారు.
అలా అంటుండగానే.. జ్ఞానాంబ.. జానకి కోసం బాక్స్ తీసుకొస్తుంది. నేను నా కోడలు కోసం లంచ్ బాక్స్ తెచ్చాను అని చెబుతుంది. తనను కూర్చోబెట్టి వడ్డిస్తుంది జ్ఞానాంబ. నా కోసం మీరు ఇంత దూరం వచ్చి బాక్స్ ఎందుకు తీసుకొచ్చారు. ఎవరికైనా చెప్పి తీసుకురావచ్చు కదా.. అంటే కూతురుకు భోజనం తీసుకురావడం శ్రమ ఎందుకు అవుతుంది.. అని అనగానే.. జ్ఞానాంబను చూసి సంతోషపడుతుంది జానకి. వంటలు ఎలా ఉన్నాయి అని అడగగానే.. చాలా బాగున్నాయి అత్తయ్య అని అంటుంది. మల్లిక బాగా చేసింది.. తనను మెచ్చుకున్నానని చెప్పండి.. అని అంటుంది జానకి. మిగితా ప్రాణులతో పోల్చితే.. మనుషులకు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? క్షమించడం. మల్లికకు నువ్వంటే ఇష్టం లేకపోయినా.. నువ్వు మాత్రం తనను క్షమిస్తున్నావు. తనను అక్కున చేర్చుకుంటున్నావు.. అనగానే.. తను నా చెల్లెలు లాంటిది అత్తయ్య.. అని అనగానే.. ఒక విషయం ఎప్పటికీ గుర్తు పెట్టుకో జానకి. అందరినీ గుడ్డిగా నమ్మకు. ఎవ్వరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. అన్నంటికంటే ముఖ్యమైన విషయం.. పొరపాటున కూడా నువ్వు అబద్ధం చెప్పకు. నువ్వు అబద్ధం చెబితే నేను అస్సలు తట్టుకోలేను.. అని జ్ఞానాంబ అంటుంది.
కట్ చేస్తే.. రామా లంచ్ కోసం ఇంటికి వస్తాడు. జానకి గారు.. జానకి గారు.. భోజనం చేద్దాం రండి.. అని పిలుస్తాడు. కానీ.. జానకి ఇంట్లో లేదన్న విషయం మరిచిపోతాడు. జానకి గారు ఖార్ఖానాకు వెళ్లిన విషయమే నాకు గుర్తు లేదు. తను ఇంట్లోనే ఉన్నారన్న ధ్యాసలో ఉన్నా. నేను వచ్చే సరికి భోం చేయకుండా జానకి గారు అలాగే ఉండేవారు.. అని అనగానే.. పెదబాబు గారు జానకమ్మ భోజనం గురించి మీరు టెన్షన్ పడకండి. పెద్దమ్మ గారే.. స్వయంగా వంట చేసి క్యారేజ్ తీసుకెళ్లారు. పెద్దమ్మ గారే తనకు వడ్డిస్తానన్నారు.. అని చికిత.. రామాతో అంటుండగానే.. అక్కడికి వచ్చిన మల్లిక.. అయ్యో నా కడుపు తరుక్కుపోతోంది బావ గారు. మీది విడదీయరాని బంధం. కానీ.. ఒకరిని మరొకరు తలుచుకొని కుమిలిపోయే పరిస్థితి వచ్చింది మీకు. మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా చెప్పండి.. అంటే మల్లిక ఎందుకు ఇప్పుడు ఆ విషయాల గురించి.. వదిలేసేయ్.. అని రామా అంటాడు.
ఎంతైనా జానకి నా తోటి కోడలు కదా. తను బాధపడుతుంటే నాకు బాధ అనిపించదా? అది కాదు బావగారు. జానకికి నామూషిగా అనిపించి.. చెప్పులు కుట్టించుకు రాలేదు అనుకోండి. దానికి జానకిని ఇంటి నుంచి బయటికి పంపించాలా? అని మల్లిక అనగానే.. అమ్మ ఏది చేస్తే అదే రైట్.. అంటాడు రామా. అది కరెక్టే బావ గారు.. అంత చిన్న విషయానికి.. మీరిద్దరూ మూడు రోజులు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ రేపు ఇంకేదైనా పెద్ద తప్పు జరిగితే.. మీరు శాశ్వతంగా దూరం అయితే.. అప్పుడు ఏం చేస్తారు. అప్పుడు తట్టుకుంటారా? మూడు రోజులు ఖార్ఖానాలో ఉండాలంటే అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు.. అని అంటుండగానే.. జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఏంటి మల్లిక ఏదో విన్యాసం చేస్తున్నావు.. అనగానే జానకి గురించే నా బాధ అత్తయ్య గారు.. ఎంతైనా నా తోబుట్టువు లాంటిది. తన గురించి నాకు ఎందుకు బాధ ఉండదు.. అని అనగానే.. నువ్వు ఒక పని చేయ్.. ఖార్ఖానాకు నువ్వు కూడా వెళ్లి జానకితో పాటు ఉండు. వెళ్లి జానకి దగ్గర రాత్రి పూట పడుకో.. వెళ్లు.. నువ్వు కూడా ఖార్ఖానాకు వెళ్లు.. అంటూ బెదిరిస్తుంది జ్ఞానాంబ.
దీంతో మల్లిక ఏడుస్తూ తన రూమ్ కు వెళ్తుంది. తన భర్త చూసి.. ఏంటి మల్లిక ఇంత సంతోషంగా ఉన్నావు అని అడగగానే.. నాకు మీ అమ్మ వేసిన శిక్ష గురించి ఏడుస్తున్నా.. అంటే.. ఎవ్వరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు.. అని అనగానే.. నువ్వు మీ అమ్మ వేసిన శిక్షను చూశావా? అంటూ ప్రశ్నిస్తుంది మల్లిక. అత్తయ్య గారి మీద బావ గారికి మెల్లగా కోపం నూరిపోద్దామని అనుకున్నా. కానీ.. అది నాకే రివర్స్ అయింది. అది నా మెడకే చుట్టుకుంది. అనగానే.. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కదా.. ఇక నుంచి నోర్మూసుకొని కూర్చో.. అనగానే.. ముందు వెళ్లి మీ అమ్మగారికి నీ కోడలు ఖార్ఖానాకు వెళ్లదు అని చెప్పండి.. అనగానే నాకెందుకు ఆ బాధ.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక.. నేను ఆ ఖార్ఖానాకు వెళ్లి చావాల్సిందేనా.. అని అంటూ తనలో తానే ఏడుస్తుంది.
ఇక రాత్రి కాగానే.. మల్లిక ఖార్ఖానాకు వెళ్లేందుకు బయలుదేరగా.. రామా వచ్చి.. మల్లిక ఏం అనుకోకుండా.. జానకికి ఈ సంచి ఇస్తావా? అంటూ ఒక సంచిని ఇస్తాడు. ఆ సంచిలో పుస్తకాలు ఉండటం చూసి.. అక్క ఏం చదువుతుంది బావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఆ పుస్తకాల సంచిని తీసుకెళ్లి జానకికి ఇస్తుంది. జానకి.. ఆ పుస్తకాలను ఓపెన్ చేస్తుంది. ఆ పుస్తకాలను చూసి మల్లిక షాక్ అవుతుంది. అంటే.. జానకి.. ఐపీఎస్ చదువుతోందా? అని అనుమానిస్తుంది. ఈ విషయం ఎలాగైనా అత్తయ్యకు చెప్పాలని అనుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. మంగళవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.