Karthika Deepam 9 Aug Today Episode : నీకోసం దీపను కూడా చంపిస్తా.. మోనిత అన్న మాటకు తీవ్ర ఆగ్రహంతో మోనిత కు గన్ గురి పెట్టిన కార్తీక్

Karthika Deepam 9 Aug Today Episode : కార్తీక దీపం 9 ఆగస్టు 2021, 1113 ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దామా? కేవలం నన్ను ప్రేమించినందుకు.. కేవలం నేను ప్రేమించినందుకు అమాయకురాలైన హిమను దారుణంగా చంపించావు చూడు.. అందుకు నిన్ను చంపాలని వచ్చాను.. అంటూ కార్తీక్.. మోనితను బెదిరిస్తాడు. దీంతో మోనితకు తన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తుంది. దీంతో వెంటనే కవర్ చేసుకోవడానికి.. నేను హిమను చంపించానని అంటున్నావా? దీప అంత పని చేసిందా? మన పెళ్లి ఆపడానికి దీప ఈ రూట్ లో వచ్చిందా? పిచ్చి కార్తీక్.. అయినా నువ్వు ఇటువంటి ఆరోపణలను ఎలా నమ్మావు. ఆ కారులో నువ్వు కూడా ఉన్నావు.  ఆ కారును గుద్దింది లారీ, రివాల్వర్ కాదు.. గురి చూసి చంపడానికి. అయినా ఆ వంటలక్క దగ్గర ఏం ఆధారం ఉందని నేను హిమను చంపానని చెబుతున్నావు.. అంటూ ప్రశ్నిస్తుంది మోనిత.

karthika deepam 9 aug 2021 latest episode 1113 highlights

దీంతో.. ఆ ఆధారం నువ్వే.. అంటూ సూర్యాపేట హోటల్ లో దీప తీసిన వీడియోను మోనితకు చూపిస్తాడు. దీంతో షాక్ కు గురవుతుంది మోనిత. నువ్వసలు ఆడదానివేనా.. అసలు నువ్వొక మనిషివేనా… అంటూ తీవ్ర స్థాయిలో మోనితపై విరుచుకుపడతాడు. హిమను చంపించడానికి నీకెలా మనసు ఒప్పిందే. తన కలలను అన్నింటినీ బూడిదలో పోశావు కదే. నిన్ను ఏం చేసినా పాపం లేదు. హిమ నిన్ను నమ్మితే ప్రాణాలు తీస్తావా? నేను నిన్ను నమ్మాను. నా ప్రేమను చంపేశావు. ఎంత దారుణమైన మనస్తత్వమే నీది. ఎంత నీచమైన వ్యక్తిత్వమే నీది. ఎంత నమ్మానే నిన్ను. కన్నతల్లి చెప్పినా వినలేదు. కట్టుకున్న భార్య చెప్పినా వినలేదు. స్నేహానికి నువ్వే నిదర్శనం అని నేను అనుకున్నా. పాపానికి పరాకాష్ట నువ్వు చూపించావు. శ్రేయోభిలాషివని నేను అనుకుంటే.. నమ్మక ద్రోహం చేసి నీ వికృత చేష్టలను చూపించావు. నరరూప రాక్షసివే నువ్వు. రక్తపిశాచివే నువ్వు. నువ్వు అసలు ఆడదానివి కాదు. మనిషివి కాదు. అడవి మృగానివి.

ఇప్పుడు చెప్పవే.. ఈ వీడియోకు ఏం సమాధానం చెబుతావు.. అనగానే దానికి సమాధానం ఉంది.. మైడియర్ కార్తీక్. నీ ప్రశ్నల్నింటికీ నా దగ్గర ఉన్న ఒకే ఒక్క జవాబు ఏంటో తెలుసా? ప్రేమ.. అన్నింటికీ ప్రేమే సమాధానం. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. చూశావా కార్తీక్. నా ప్రేమ ఎంత గాఢమైందో అర్థమైందా? నీకోసం నీ ప్రేమ కోసం నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం నేను ఎంత రిస్క్ తీసుకున్నానో.. నీకు ఇప్పటికైనా తెలిసిందా? ప్రాణాలు నిలబెట్టే వృత్తిలో ఉన్న నేనే.. ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లానంటే కారణం ఏంటి? ప్రేమ. నువ్వంటే పిచ్చి ప్రేమ. అయ్యో.. వెర్రివాడా… నీకింకా చాలా నిజాలు తెలియవు. నా ప్రేమ ఎంత అద్భుతమైందో.. నీకు తెలిసే అవకాశం ఇప్పుడే ఇస్తున్నాను. నువ్వు హిమ చావు గురించి తెలిస్తేనే ఇంతలా బాధపడుతున్నావు. కానీ.. నేను నీకోసం నీ ప్రేమ కోసం నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం నీ భార్య దీపను కూడా చంపించడానికి దుర్గతో బేరం కుదుర్చుకున్నాను. ఆ సంగతి తెలుసా? అయినా బతికింది పుణ్యాత్మురాలు. ఆ యాక్సిడెంట్ నువ్వే చేయించావని.. దీపకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లేలా చేశాను. నీ మీద మనసు విరిగిపోవాలనే కదా. చూశావా నా ప్రతిభ. నిన్ను నీ భార్యను విడదీయడానికి విహారిని అడ్డం పెట్టుకొని.. నీలో అనుమానాన్ని పెంచి పోషించింది ఎవరు అనుకున్నావు… నేనే. ఎందుకనుకున్నావు. ప్రేమ. నువ్వంటే పిచ్చి ప్రేమ. నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలుసా? నా ప్రేమలో ఎంత నీతి దాగి ఉందో తెలుసా? నీ భార్య మీద నీకు అనుమానం కలగడానికి ముందే.. నీకు నీ మీదే అనుమానం కలిగేలా చేశాను. హిమకు, నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడే.. నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ తో చెప్పించాను.

karthika deepam 9 aug 2021 latest episode 1113 highlights

Karthika Deepam 9 Aug Today Episode : దీప డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్లో పాయిజన్ ఇవ్వబోయా

అప్పుడు.. చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటావని ఆశ పడ్డాను. కానీ.. నువ్వు దీపను పెళ్లి చేసుకున్నావు. దీప గర్భవతి కాగానే.. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్న కోపంతో వదిలేశావు. చూశావా? చూశావా? చూశావా? నీకోసం ఒక్క ఆడపిల్ల.. ఆడపిల్ల అనే సంగతి కూడా మరిచిపోయి.. ఎన్ని ప్రయత్నాలు చేసిందో చూశావా? డెలివరీ టైమ్ లో దీపకు స్లో పాయిజన్ ఇంజిక్షన్ వేస్తుంటే.. దుర్గగాడు వచ్చి లాక్కెళ్లిపోయాడు. లేకపోతే ఈపాటికి దీప కూడా చచ్చేదే? నువ్వే ట్రీట్ మెంట్ ఇప్పించి బతికించావు. అప్పుడు నువ్వు నీ భార్య పాదాలు పట్టుకొని నన్ను క్షమించు దీప అంటుంటే.. నా గుండెల్లో కలుక్కుమంది తెలుసా? మీరిద్దరు కలిసిపోతే. ఒక్కటైపోయి.. కలిసి కాపురం చేస్తే.. మరి నేను… నేను.. నా ప్రేమ. నా ఆశలన్నీ ఏమైపోవాలి. ఇన్నేళ్లు నేనే చేసిన ప్రయత్నాలన్నీ గంగలో కలిసిపోవాల్సిందేనా. అందుకే.. నిన్ను సొంతం చేసుకోవడం కోసం ఏ ఆడదీ చేయలేని సాహసం చేశాను. ఇన్నాళ్లు నిన్ను వేధిస్తున్న ప్రశ్నకు ఇన్ని రోజులు నీ వ్యక్తిత్వం మీద నీకే అనుమానం రేకెత్తించిన ప్రశ్నకు ఇదిగో నా సమాధానం. నువ్వు.. నీకు పిల్లలు పుడతారా? లేదా? అని తెలుసుకోవడం కోసం వెళ్లి.. నువ్వు టెస్టుల కోసం ఇచ్చిన శాంపిల్స్ ను నేను నా ఆండంలో ప్రవేశపెట్టి గర్భవతిని అయ్యాను.

ఎలా అయితేంది కార్తీక్.. ఇప్పుడు నా గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అని నేనంటే నువ్వు కాదంటావా? ఈ బిడ్డకు నాన్న కావాలి. నువ్వు.. నాకే.. నాకే సొంతం అవ్వాలి. మనం పెళ్లి చేసుకోవాలి. అని అనగానే.. కార్తీక్ కు విపరీతమైన కోపం వస్తుంది. దీంతో కోపం తెచ్చుకోకు కార్తీక్. వీటన్నింటిలో నువ్వు హింసను చూడకు. స్వచ్ఛమైన మన ప్రేమను మాత్రమే చూడు.. అని మోనిత అనగానే.. నోర్మూయ్.. అంటూ కార్తీక్ సీరియస్ అవుతాడు.

ఇది ప్రేమా.. నీది ప్రేమా.. దీన్ని కూడా ప్రేమ అంటారా? నిన్ను కూడా ఒక మనిషి అంటారా? ఎంత ధైర్యమే నీకు. నీ మీద నీకు ఎంత నమ్మకమే. ఇన్ని నేరాలు.. ఇన్ని దారుణాలు.. ఇన్ని ఘోరాలు చేసి కూడా.. అదేదో నీ విజయపరంపరలాగా చెబుతున్నావే నీతిమాలినదానా. ఏ కోశాన.. ఆడతనమే లేని దిక్కుమాలిన బతుకే నీది. నీలాంటి దాన్ని ఇంకా ఇంకా బతకనిస్తే.. ఇంకెన్నో దారుణాలు చేస్తావు. ఇంకెందరి ప్రాణాలైనా తీస్తావు. ఆఖరికి నేను కూడా కాదంటే.. నన్ను కూడా చంపడానికి వెనకడావే నువ్వు. అమాయకురాలైన హిమను చంపించినందుకు.. దేవతలాంటి దీపను పతిత అని ముద్ర వేయించినందుకు నిన్ను జీవితంలో అస్సలు క్షమించను. నిన్ను ఊరికే వదులుతాననుకుంటున్నావా? నిన్ను ఈ భూమి మీదనే లేకుండా చేస్తా.. చంపేస్తా.. అంటూ తన జేబులో నుంచి గన్ తీసి మోనితకు గురి పెడుతాడు కార్తీక్.

karthika deepam 9 aug 2021 latest episode 1113 highlights

నా కార్తీక్.. నన్ను చంపేస్తాడా? ఇవన్నీ నీకు దారుణాలుగా కనిపిస్తున్నాయా? వీటి వెనుక నా కారణాలు నీకు అర్థం కావడం లేదా? ఎంత వెర్రివాడివి. నీ ప్రేమ మూర్తిని నువ్వే చేతులారా చంపేస్తావా? ఓహ్.. దీప ఏమనుకుంటుందోనని ఆలోచిస్తున్నావా? ఇన్ని చేసిన దాన్ని దీపను చంపడం ఓ లెక్కా. అవసరమైతే.. మీ అమ్మను కూడా .. అని అనేసరికి.. సీరియస్ అయి.. హేయ్.. అంటూ మోనితపై అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం మంగళవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago