Janasena : ఆ మూడు నియోజకవర్గాల్లో టీడీపీని ఒక్క తొక్కు తొక్కి పైకి వచ్చిన జనసేన..!
Janasena : 2019 ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో 151 సీట్లను గెలుచుకుంది. టీడీపీ 23 సీట్లలో గెలవగా, జనసేన మాత్రం ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. 151 సీట్లలో గెలిచి వైసీపీ తన సత్తా చాటింది. జనసేన పార్టీకి ఒకే ఒక్ సీటు దక్కడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢీలా పడిపోయారు. పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఆ రెండు స్థానాల్లో వైసీపీనే గెలిచింది. అయితే.. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఒకప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావమే లేదు. కానీ.. ఇప్పుడు అలా కాదు. అందుకే..
ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు.దానికి తగ్గట్టుగానే ఈ రెండు జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఈ రెండు జిల్లాల్లో కాపు సామాజికవర్గం ఎక్కువ. అలాగే క్షత్రియులు కూడా ఎక్కువే. అందుకే.. ఈ రెండు సామాజికవర్గాలను తనవైపునకు తిప్పుకోవడం కోసం పవన్ కళ్యాణ్ పక్కాగా ప్లాన్ వేస్తున్నారు. ఎలాగూ తనకు అభిమాన బలం ఉంది. అందుకే రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవచ్చని పవన్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం నరసాపురంలో జనసేన బలంగానే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ నరసాపురంలో పోటీ చేస్తారా? లేక వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తారా?
Janasena : నరసాపురంలో బలంగా ఉన్న జనసేన
లేదంటే పొత్తులో భాగంగా మిత్రపక్షానికి టికెట్ కేటాయిస్తారా? అనేది తెలియదు. అలాగే రాజోలు నియోజకవర్గం కూడా జనసేనకు అనుకూలంగానే ఉంది. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ వైపు తిరిగినా జనసేన, వైసీపీ మధ్యే పోరు నడుస్తోంది. భీమవరం, రాజోలు, నరసాపురం ఈ మూడు నియోజకవర్గాలు జనసేనకు బలంగా మారాయి. అలాగే ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేనకు వైసీపీతోనే పోటీ. అందుకే.. ఈ మూడు నియోజకవర్గాల్లో తమ సత్తా చాటడంతో పాటు మిగితా నియోజకవర్గాల్లోనూ పాగా వేయడానికి పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. చూద్దాం మరి.. 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందో.