why there is a clash between tdp and janasena party
JanaSena : ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఇమేజ్ పెరుగుతోందన్నది నిర్వివాదాంశం. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓ సీటు వచ్చింది. అలా గెలిచిన ఎమ్మెల్యే, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు.. జనసేనాని తీరు నచ్చక. జనసేన రాజకీయాలు నచ్చక.! ఆయనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. 2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఎంతమేర బలపడుతుంది.? నిజానికి, జనసేన బలపడింది. ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడే నాయకులు కొంతమంది కనిపిస్తున్నారు.
మరి, జనసేనాని పరిస్థితేంటి.? పవన్ కళ్యాణ్ కూడా జనంలో వుండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన పనిగట్టుకుని వైసీపీని విమర్శించడం వల్ల జనసేన పార్టీకే నష్టమన్న వాదనా లేకపోలేదు. అయితే, అధికారంలో వున్న పార్టీని బలంగా ప్రశ్నించినప్పుడే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత మేర తనకు కలిసి వస్తుందని ఏ విపక్షమైనా ఆలోచన చేస్తుంది. ఈ కోణంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నది కొంతమేర సబబే. కానీ, జనసేన వాయిస్‌లో ఎక్కువగా టీడీపీ రంగు కనిపిస్తుండడమే అసలు సమస్య. కానీ, ఆ రంగుని జనసేన చెరిపేసుకోవడం చాలా చాలా కష్టమవుతోంది.
JanaSena Hain, TDP Loss
కొంతమేర బీజేపీని దూరం పెట్టిన జనసేన, ఈ మధ్య టీడీపీని కూడా దూరం పెట్టినట్లే కనిపిస్తోంది. ఇదే నిజమైతే, జనేసేన 2024 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించొచ్చు. అంటే, సింగిల్ డిజిట్ దాటి, రెండు డిజిట్ల మేర సీట్లు దక్కించుకోవచ్చు. అధికారం జనసేనకు వచ్చేస్తుందని ఎవరైనా ఆశిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. బలమైన ప్రతిపక్షంగా జనసేన ఎదగాలనుకుంటే, ఎట్టి పరిస్థితుత్లోనూ టీడీపీ ట్రాప్‌లోగానీ, బీజేపీ ట్రాప్‌లోగానీ పడకూడదు. కానీ, అది జనసేనానికి సాధ్యమయ్యే పనేనా.?
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.