JanaSena : జనసేన ఎదుగుతోంది.! టీడీపీ మునుగుతోంది.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JanaSena : జనసేన ఎదుగుతోంది.! టీడీపీ మునుగుతోంది.!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 July 2022,6:00 am

JanaSena : ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఇమేజ్ పెరుగుతోందన్నది నిర్వివాదాంశం. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓ సీటు వచ్చింది. అలా గెలిచిన ఎమ్మెల్యే, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు.. జనసేనాని తీరు నచ్చక. జనసేన రాజకీయాలు నచ్చక.! ఆయనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. 2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఎంతమేర బలపడుతుంది.? నిజానికి, జనసేన బలపడింది. ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడే నాయకులు కొంతమంది కనిపిస్తున్నారు.

మరి, జనసేనాని పరిస్థితేంటి.? పవన్ కళ్యాణ్ కూడా జనంలో వుండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన పనిగట్టుకుని వైసీపీని విమర్శించడం వల్ల జనసేన పార్టీకే నష్టమన్న వాదనా లేకపోలేదు. అయితే, అధికారంలో వున్న పార్టీని బలంగా ప్రశ్నించినప్పుడే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత మేర తనకు కలిసి వస్తుందని ఏ విపక్షమైనా ఆలోచన చేస్తుంది. ఈ కోణంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నది కొంతమేర సబబే. కానీ, జనసేన వాయిస్‌లో ఎక్కువగా టీడీపీ రంగు కనిపిస్తుండడమే అసలు సమస్య. కానీ, ఆ రంగుని జనసేన చెరిపేసుకోవడం చాలా చాలా కష్టమవుతోంది.

JanaSena Hain TDP Loss

JanaSena Hain, TDP Loss

కొంతమేర బీజేపీని దూరం పెట్టిన జనసేన, ఈ మధ్య టీడీపీని కూడా దూరం పెట్టినట్లే కనిపిస్తోంది. ఇదే నిజమైతే, జనేసేన 2024 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించొచ్చు. అంటే, సింగిల్ డిజిట్ దాటి, రెండు డిజిట్ల మేర సీట్లు దక్కించుకోవచ్చు. అధికారం జనసేనకు వచ్చేస్తుందని ఎవరైనా ఆశిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. బలమైన ప్రతిపక్షంగా జనసేన ఎదగాలనుకుంటే, ఎట్టి పరిస్థితుత్లోనూ టీడీపీ ట్రాప్‌లోగానీ, బీజేపీ ట్రాప్‌లోగానీ పడకూడదు. కానీ, అది జనసేనానికి సాధ్యమయ్యే పనేనా.?

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది