Pawan Kalyan : పార్టీ పెట్టి ఇన్నాళ్లయినా ఇంకా అడుక్కోవడం ఏంటి పవన్ కళ్యాణ్?
Pawan Kalyan : రాష్ట్రంకు జరిగిన అన్యాయం నుండి పుట్టుకొచ్చిన పార్టీ అంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంకు జరిగింది అన్యాయం నిజమే.. కాని పార్టీని పెట్టి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే సమాధానం ఆ పార్టీ నాయకుల వద్ద కూడా లేదు. 2014 లో పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఏమాత్రం మొహమాటం లేకుండా మొదటి ఎన్నికల సమయంలోనే రాష్ట్రంలో టీడీపీ మరియు కేంద్రంలో బీజేపీ పల్లకి మోశాడు. తాను పల్లకి మోయడం వల్లే వారు అధికారంలోకి వచ్చారు అనేది పవన్ అభిప్రాయం. 2019 ఎన్నికల్లో ఎవరి పల్లకినో నేను ఎందుకు మోస్తాను..
నాది నేను మోసుకుంటాను అంటూ ఎన్నికల్లో పోటీ చేసి బొక్క బోర్లా పడ్డాడు.జనసేన పార్టీకి సింగిల్ గా అంత సీన్ లేదని ఆయనకు అర్థం అయ్యింది. దారుణమైన ఫలితం చవి చూడటంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన పవన్ మళ్లీ పొత్తుల రాగం ఎత్తుకున్నాడు. ఒక వైపు బీజేపీతో ఉంటూనే టీడీపీతో కలవాలని కలలు కంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీతో పొత్తు ఉంటుంది. టెక్నికల్ గా చూస్తే మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం క్యాండిడేట్ అవుతాడు. కాని ఇప్పుడు మాత్రం పవన్ మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడును అడుక్కుంటున్నాడు. పార్టీ పెట్టి 8 ఏళ్లకు పైగానే అయ్యింది.
అయినా ఇప్పటి వరకు సొంతంగా బలం ఏర్పర్చుకోవడంలో జనసేన పూర్తిగా విఫలం అయ్యింది. మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప కనీసం అయిదు పది సీట్లు గెలిచే సత్తా కూడా జనసేనకు లేదు. అలాంటి జనసేన ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అడుక్కోవాల్సిందే తప్ప డిమాండ్ చేసి మాకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ హోదా ఇవ్వండి.. కలిసి పోటీ చేద్దాం అని మాత్రం అనే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ ఈ స్థితిలో ఉండగా పొత్తులతో పెద్దగా ప్రభావం చూపలేమని తెలిసి కూడా ముఖ్యమంత్రి కుర్చీలాట ఆడుతూ జనాలను పిచ్చోళ్లను చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.