YCP : ‘మా బలమేంటో తెలుసు, మా బలహీనతలేంటో తెలుసు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లోనూ కనీసం అంటే 5 వేల నుంచి 6 వేల మంది ఓటర్లు మా పార్టీకి వున్నారు. మూడో వంతు సీట్లలో పోటీ చేస్తాం.. అధికారంలోకి వచ్చేస్తామంటూ మా శక్తికి మించిన ప్రకటనలు చేయం..’ అని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ‘పొలిటికల్ షో’ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు.! తెలంగాణలో కౌలు రైతులు లేరా.? వారిలో బలవన్మరణాలకు పాల్పడినవారెంతమంది.? తెలంగాణపై ఈ చిన్న చూపు ఎందుకు.?
అనే విమర్శలు రావడంతో, జనసేనాని తెలంగాణలోనూ ఓ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. జనసేన కార్యకర్త ఒకరు ఇటీవల మరణించగా, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించే నెపంతో తెలంగాణ రాజకీయాల్లో సందడి చేశారు జనసేనాని. ఏ రాజకీయ పార్టీ అయినా, తనకు నచ్చిన రీతిలో రాజకీయాలు చేయొచ్చు. దాన్ని ఎవరూ కాదనలేరు. వాటిల్లో తప్పొప్పుల్ని ఖచ్చితంగా మీడియా, జనం కూడా విశ్లేషించడం జరుగుతుంది. కానీ, అలా విశ్లేషిస్తే, జనసేనానికి ఒళ్ళు మండిపోతుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ మీద జనసేనాని చేసే విమర్శల తీవ్రత ఎలా వుంటుందో అందరికీ తెలిసిందే. ఆ తీవ్రతలో పదో వంతు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద చేసేంత సీన్ జనసేనానికి లేదు. 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసింది, తన ఉనికిని చాటుకోలేక చతికిలపడింది.
స్థానిక ఎన్నికల్లోనూ అంతే. మరెలా మూడొంతుల సీట్లలో జనసేనాని పోటీ చేయగలుగుతుంది.? మిత్రపక్షం బీజేపీ కూడా తెలంగాణలో జనసేన పార్టీని పట్టించుకోవడంలేదాయె. వైసీపీ తేరగా దొరుకుతోంది జనసేన పార్టీకి. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. అందుకే, అక్కడ జనసేనాని సినిమాటిక్ రాజకీయాలు చేయగలుగుతున్నారన్నది సర్వత్రా వినిపిస్తోన్న ఓ విమర్శ. దీనికి తెలంగాణ జనసైనికులు సైతం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ మీద చేసిన విమర్శల తరహాలో కేసీయార్ మీద చేస్తే, ఆ ఎఫెక్ట్ ఎలా వుంటుందో తెలుసు గనుకనే.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ‘నాకు భయం అంటే తెలియదు..’ అని జనసేనాని చెబుతారుగానీ, కేసీయార్‌కి పవన్ కళ్యాణ్ భయపడుతున్న వైనం కనిపిస్తూనే వుంది.
Bull : అదుపుతప్పిన ఓ ఎద్దు పేట్రేగిపోయింది. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ 15 మందిని గాయపరిచింది. ఎద్దు స్వైర విహారానికి…
Surya : కోలీవుడ్ స్టార్ సూర్యకు కంగువ ఇచ్చిన షాక్ గురించి అందరికీ తెలిసిందే. శివ డైరెక్షన్లో 350 కోట్ల…
Birth Certificate : ఆంధ్రప్రదేశ్ లో ఈమధ్య అన్ని గుర్తింపు ధృవీకరణ పత్రాలు.. ప్రభుత్వ సేవలకు యాక్సెసింగ్ చాలా ఈజీ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్గా 12 వారాలు పూర్తి చేసుకోగా,…
Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా…
Siddharth Vs Allu Arjun : డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం భారీ…
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
This website uses cookies.