Viral Photo : ఈ ఫోటో చూస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే.. భుజాన బిడ్డతో నది దాటి.. ఈమె చేసే పనికి సలామ్ కొట్టాల్సిందే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Photo : ఈ ఫోటో చూస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే.. భుజాన బిడ్డతో నది దాటి.. ఈమె చేసే పనికి సలామ్ కొట్టాల్సిందే..!

Viral Photo : ఒకే ఒక మహిళ.. తన బాధ్యతను ఎంత బాధ్యతగా నిర్వర్తించిందో.. ఇప్పటికీ నిర్వర్తిస్తుందో తెలిస్తే నివ్వరబోతాడు. చిన్న పిల్లాడు ఉన్నా.. ఎటువంటి సాకులు చెప్పకుండా.. తన పనిలో ఎంతో నిబద్ధతతో ముందుకు వెళ్తున్న ఈ మహిళకు హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ ఫోటో చూస్తే మనకే కన్నీళ్లు వస్తాయి. మనమే భయపడిపోతాం. ఎందుకంటే.. ఒక నది దాటడం అంటే అంత ఈజీ కాదు. అది కూడా తన బిడ్డను భుజాన వేసుకొని.. చేతిలో వ్యాక్సిన్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 June 2021,10:07 am

Viral Photo : ఒకే ఒక మహిళ.. తన బాధ్యతను ఎంత బాధ్యతగా నిర్వర్తించిందో.. ఇప్పటికీ నిర్వర్తిస్తుందో తెలిస్తే నివ్వరబోతాడు. చిన్న పిల్లాడు ఉన్నా.. ఎటువంటి సాకులు చెప్పకుండా.. తన పనిలో ఎంతో నిబద్ధతతో ముందుకు వెళ్తున్న ఈ మహిళకు హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ ఫోటో చూస్తే మనకే కన్నీళ్లు వస్తాయి. మనమే భయపడిపోతాం. ఎందుకంటే.. ఒక నది దాటడం అంటే అంత ఈజీ కాదు. అది కూడా తన బిడ్డను భుజాన వేసుకొని.. చేతిలో వ్యాక్సిన్ బాక్స్ పెట్టుకొని ఆమె చేస్తున్న పనికి సలామ్ కొట్టాల్సిందే. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఇలా చాలా రోజుల నుంచి ఆమె చేస్తున్న పనిని చూసి అక్కడి స్థానికులే నివ్వరపోతున్నారట. ఇంతకీ ఆమె చేసే పని ఏంటి? ఆమె స్టోరీ ఏంటి? తెలుసుకుందాం రండి.

jharkhand health worker crosses river to give vaccine

jharkhand health worker crosses river to give vaccine

మంతీ కుమారి. జార్ఖాండ్ లోని లతేహార్ ఆమె ఊరు. అక్కడే కాంట్రాక్ట్ పద్ధతిలో నర్స్ గా విధులు నిర్వర్తిస్తోంది. తన పని ఏంటంటే.. లతేహార్ ప్రాంతంలో చుట్టు పక్కన ఉన్న ఊళ్లకు వెళ్లి అక్కడ పిల్లలకు వ్యాక్సిన్ వేయడం. అయితే.. లతేహార్ ప్రాంతంలో చుట్టూ అడవులే ఉంటాయి. ఆ అడవుల్లో ఉండే ఊళ్లకు రోడ్లు ఉండవు. అక్కడికి ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కూడా ఉండదు. అక్కడి గ్రామాలకు వెళ్లాలంటే.. అడవుల్లో నడుచుకుంటూ వెళ్లాలి. నది దాటుకుంటూ వెళ్లాలి.

Viral Photo :  రోజూ 35 కిలోమీటర్ల నడక.. మధ్యలో నది

మంతీ కుమారికి ఎనిమిది గ్రామాలను అప్పగించారు అధికారులు. ఆ ఎనిమిది గ్రామాలన్నీ అడవుల్లోనే ఉంటాయి. అక్కడికి ఎటువంటి రోడ్డు సౌకర్యం ఉండదు. ఆయా గ్రామాలకు వెళ్లేందుకు మంతీ రోజూ 35 కిలోమీటర్లు అడవుల్లో నడవాలి. అలాగే.. ఓ నదిని కూడా దాటాలి. గత సంవత్సరం అంటే తను ఒక్కరే కాబట్టి.. ఎలాగోలా వ్యాక్సిన్ బాక్స్ ను పట్టుకొని నది దాటి గ్రామాలకు వెళ్లేది కానీ.. తను ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయినా కూడా తన పనిలో నిబద్ధతను కోల్పోలేదు. తన బిడ్డను భుజాన వేసుకొని అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి.. బిడ్డతోనే నది దాటి పిల్లలకు వ్యాక్సిన్ వేస్తోంది.

jharkhand health worker crosses river to give vaccine

వాళ్లది చాలా పేద కుటుంబం. కరోనా వల్ల భర్త చేసే పని కూడా పోవడంతో కుటుంబ పోషణ తన మీద పడింది. ఉన్న ఈ ఉద్యోగం కూడా పోతే.. తిండికి కూడా ఉండదని భావించి.. ఎంత కష్టమైనా.. తన బిడ్డ ప్రాణాలను అరచేతిలో పెట్టి.. ఈ సాహసం చేస్తున్న ఆ మహిళను చూసి అక్కడి స్థానికులు తెగ మెచ్చుకుంటన్నారు. తన బిడ్డతో కలిసి నది దాటుతున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది