A big accident is going to happen to Gemini on April 20
మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. ఇంటా, బయటా అనుకోని సమస్యలు రావచ్చు జాగ్రత్త. కార్యాలయాలలో అనుకోని పనివత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు, నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు చికాకులను కలిగిస్తాయి. ఆర్థిక మందగమనంలో రోజు గడుస్తుంది. శుభ ఫలితాల కోసం శ్రీలక్ష్మీ, దుర్గాదేవతలను ఆరాధించండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు అలసట, ప్రయాణ బాధలు ఉంటాయి. ఆర్థికంగా సాధారణమైన రోజు. వ్యాపారాలు ముందుకు సాగవు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు.
వ్యయప్రయాసలు. పనులు మందగిస్తాయి. గోసేవ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
మిధునరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహకరంగా ఉంటుంది. అనుకోని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో, సమాజంలో గౌరవం. ధనలాభం, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో పనులు ముందుకు రావు. ఆర్థిక మందగమనం. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. శత్రువుల బాధలు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. శ్రీలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారులకు, ఉద్యోగులకు కొంత కాలంగా ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారం అవుతాయి.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు మంచిరోజు.సమాజంలో మీకు పేరు ప్రతిష్ఠలు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాల కోసం నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
కన్యారాశి ఫలాలు : ఈరోజు స్వల్ప సమస్యలతో సాగుతుంది. మీ తెలివి తేటలతో, ఓర్పుతో వాటిని అధిగమిస్తారు. కార్యాలయాలలో శ్రమ అధికంగా ఉంటుంది. చిల్లర,టోకు వ్యాపారులకు మంచిగా ఉంటుంది. పాల వ్యాపారులు, కిరాణం వారికి మంచిరోజు.దూరప్రయాణాలు. బంధువులతో ఇబ్బందులు. శ్రీ చండీ ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, ఇంటా, బయటా పనులను సంతోషంగా వేగంగా పూర్తిచేస్తారు,. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రుల కలయిక. విందువినోదాలలో పాల్గొంటారు. నవగ్రహా స్తోత్రం పారాయణం చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు విజయం లభిస్తుంది,. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో ముఖ్య విషయాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు పురోభివృద్ధి బాటలో పయనిస్తాయి. శివుడికి తుమ్మిపూలతో ఆరాధన చేయండి,.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ధన సంబంధ విషయాలలో జాగ్రత్తలు అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండాల్సిన రోజు. మిత్రులతో విభేదాలు. అనారోగ్య సూచన. శుభ ఫలితాల కోసం శ్రీహనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులు నెమ్మదిగా పూర్తిచేస్తారు. అనుకోని అతిథుల రాకతో బిజీగా గడుస్తుంది. పనులలో విఘ్నాలు వస్తాయి. కొత్త వస్తువుల కొనుగోలకు ప్రయత్నాలు చేస్తారు. అప్పులు చేసే అవకాశం ఉంది, మానసిక ప్రశాంతత ఉండదు. వివాహం అయినవారికి భార్య తరపు వారి నుంచి లాభాలు కలుగుతాయి. శ్రీఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు ముఖ్యమైన వార్తలు వింటారు. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
పనులలో విజయం. శుభవార్తా శ్రవణం. కొత్త వాహనాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి వ్యాపార ఒప్పందాలు. శ్రీశివరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు శుభవార్త శ్రవణం. బంధువుల నుంచి కొత్త ప్రపోజల్స్ వింటారు. స్నేహితులతో విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ధన సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుల బాధలు తీరుతాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…
Operation Sindoor : పాక్లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…
Anganwadis : అంగన్వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…
Double Bedroom Houses : గ్రేటర్లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని…
fish food : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్,…
AP Ration Cards : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆంధ్ర్ర్రప్రదేశ్ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు…
This website uses cookies.