JR NTR : దయచేసి చంద్రబాబును విడిచిపెట్టమని జగన్ వద్ద ప్రాధేయపడ్డ జూనియర్ ఎన్టీఆర్..!!
JR NTR : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కావటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ శనివారం అరెస్టు చేసి ఆదివారం ఏసీబీ కోర్టులో పెట్టగా కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ఆదివారం సాయంత్రం చంద్రబాబుని విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అయితే చంద్రబాబు అరెస్టు పట్ల నందమూరి కుటుంబానికి చెందిన సభ్యులు సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది.
నందమూరి రామకృష్ణ మీడియా సముఖంలో కన్నీరు పెట్టుకుని చంద్రబాబుకి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించకపోవడం పట్ల విమర్శలు రాగా…వైసీపీలో ఓ ప్రముఖ ఎమ్మెల్యేతో జూనియర్ ఎన్టీఆర్ టచ్ లోకి వెళ్లడం జరిగింది అంట. సదరు ఎమ్మెల్యేతో చంద్రబాబు అరెస్టు వ్యవహారం గురించి చర్చించి వైయస్ జగన్ తో తనని మాట్లాడించాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారట.
దీంతో సదరు ఎమ్మెల్యే లండన్ లో ఉన్న జగన్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో ఫోనులో జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడటం జరిగింది అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంట. చంద్రబాబు వయసు ఇంకా అనారోగ్యం వాటి విషయాలను జగన్ దృష్టికి తీసుకెళ్లి… విడుదల చేయాలని కోరడం జరిగిందట. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతుంది.