Paris Olympics : పారిస్ ఒలంపిక్స్ లో అతనిపై చీటింగ్.. నీ మెడల్ దోచేశారంటూ భారత బాక్సర్ పై కామెంట్స్..!
Paris Olympics : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలంపిక్స్ లో భారత్ పతకాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఐతే బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. బాక్సింగ్ లో క్వార్టార్ ఫైనల్ లో దాదాపు పతకం వచ్చినట్టే అని ఫిక్స్ అయిన నిశా దేవ్ కు అనూహ్యంగా పరాజయం పలకరించింది. ఐతే నిశాంత్ దేవ్ ఓడిపోవడానికి కారణం జడ్జీల చీటింగ్ కారణమని అంటున్నారు. 71 కేజీలో విభాగంలో పోటీ పడ్డ నిశా […]
ప్రధానాంశాలు:
Paris Olympics : పారిస్ ఒలంపిక్స్ లో అతనిపై చీటింగ్.. నీ మెడల్ దోచేశారంటూ భారత బాక్సర్ పై కామెంట్స్..!
Paris Olympics : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలంపిక్స్ లో భారత్ పతకాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఐతే బాక్సింగ్ లో నిశాంత్ దేవ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. బాక్సింగ్ లో క్వార్టార్ ఫైనల్ లో దాదాపు పతకం వచ్చినట్టే అని ఫిక్స్ అయిన నిశా దేవ్ కు అనూహ్యంగా పరాజయం పలకరించింది. ఐతే నిశాంత్ దేవ్ ఓడిపోవడానికి కారణం జడ్జీల చీటింగ్ కారణమని అంటున్నారు. 71 కేజీలో విభాగంలో పోటీ పడ్డ నిశా దేవ్ ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఓటమి పాలయ్యాడు.మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే తో 4-1 తేడతో నిశాంత్ ఓడడం జరిగింది. ఐతే ఈ మ్యాచ్ లో తొలి రౌండ్ లో నిశాంత్ తన దూకుడు తనంతో ఆధిక్యం లో ఉన్నాడు. వరుసగా రెండు రౌండ్లతో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశాంత్ ఆ తర్వాత కాస్త వెనకపడ్డాడు. ఈ క్రమంలో జడ్జీలు కూడా ప్రత్యర్ధి బాక్సర్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అతనే విజేతగా నిలిచాడు. ఐతే నిశాత్ ఓటమిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Paris Olympics మద్ధతుగా నిలిచిన విజేందర్ సింగ్, రణ్ దీప్..
ఈ క్రమంలో జడ్జిల కారణంగానే నిశాంత్ ఓడిపోయాడని అతనికి మద్ధతుగా నిలిచారు భారత మాజీ ఛాపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ హీరో రణ్ దీప్. సోషల్ మీడియా వేదికగా వారు ఈ మ్యాచ్ స్కోరింగ్ సిస్టెం ను తప్పుపట్టారు. ఇది గొప్ప ఫైట్ మ్యాచ్ స్కోరింగ్ స్క్సిటెం ఏంటో అర్ధం కాలేదు. నిశాంత్ దేవ్ చాలా అద్భుతంగా ఆడాడు. నిశాంత్ నువ్వు బాధపడొద్దని విజేందర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
బాలీవుడ్ హీరో రణ్ దీప్ హుడా కూడా ఒలంపిక్స్ కమిటీపై కామెంట్స్ చేశాడు. ఈ పోటీలో నిశాంత్ దే గెలుపు కానీ స్కోరింగ్ విధానంలో తప్పుల వల్ల నీ నుంచి పతకం దూరమైంది. నీ నుంచి పతకాన్ని దోచేశారు. కానీ నువ్వు మా మనసులు గెలిచావు.. ఇది బాధాకరం ఇలాంటివి చాలా జరిగాయని రణ్ దీప్ అన్నారు. మ్యాచ్ లో మొదట దూకుడిగా ఉన్న నిశాంత్ గెలుపు తనదే అనుకున్నాడు. ఐతే జడ్జిలు ప్రత్యర్ధిని విజేతగా ప్రకటించిన టైం లో నిశాంత్ డిజప్పాయింట్ ఔయ్యాడు. ఈ మ్యాచ్ గెలిస్తే కనీసం నిశాంత్ కి కాంస్య పతకం అయినా వచ్చి ఉండేది.