KA Paul : బంపరాఫర్.. పాల్ పుట్టిన రోజున .. ఇలా చేస్తే విజేత మీరే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KA Paul : బంపరాఫర్.. పాల్ పుట్టిన రోజున .. ఇలా చేస్తే విజేత మీరే..!

KA Paul : కేఏ పాల్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ప్రజాశాంతి అనే పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమైనా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. టీవీల్లో, ఇంటర్వ్యూలలో కేఏ పాల్ ను మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఈనెల 25న కేఏ పాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 September 2022,7:30 pm

KA Paul : కేఏ పాల్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ప్రజాశాంతి అనే పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమైనా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. టీవీల్లో, ఇంటర్వ్యూలలో కేఏ పాల్ ను మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఈనెల 25న కేఏ పాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు ఈ సంవత్సరంతో 59 ఏళ్లు నిండుతున్నాయి. అందుకని.. 59 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చారు.

కేవలం ఉద్యోగం కల్పించడమే కాదు.. ఆ 59 మంది నిరుద్యోగులకు పాస్ పోర్ట్, అమెరికా వీసా ఇప్పించి అక్కడే యూఎస్ లో జాబ్ ఇప్పిస్తా అని.. ఇది కేవలం త్వరలో ఉపఎన్నిక జరగబోయే మునుగోడు నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగుల కోసమే అని ఆయన ఈసందర్భంగా ప్రకటించారు. అంటే.. కేఏ పాల్ మునుగోడులో పోటీ చేస్తున్నారా అనే డౌట్ మీకు రావచ్చు. ఆయన పోటీ చేయడం లేదు.. గీటీ చేయడం లేదు. కానీ.. మునుగోడు యువతను మాత్రం బాగానే ఆకట్టుకుంటున్నారు. అయితే.. మునుగోడు ఉపఎన్నికల్లో కేఏ పాల్ పోటీలో లేకున్నా కేవలం సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని ఆయన ఆరోపించారు.

ka paul bumper offer to munugode unemployed youth

ka paul bumper offer to munugode unemployed youth

KA Paul : సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేసినందుకు ప్రతిఫలంగా ఈ ఆఫర్

అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ప్రధాని మోదీ మాత్రం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ.. తాను మాత్రం తన పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నానని కేఏ పాల్ స్పష్టం చేశారు. మునుగోడులో 50 వేల మంది నిరుద్యోగ యువత ఉన్నారని, తమ కుటుంబ సభ్యులతో కలిసి అందరూ వస్తే వాళ్ల పేర్లు రాసి లాటరీ పద్ధతిలో 59 మందిని ఎన్నుకొని వారికి పాస్ట్ పోర్ట్, వీసా అన్నీ అరేంజ్ చేసి అమెరికా వీసా ఇప్పించే బాధ్యత తనదని కేఏ పాల్ భరోసా ఇచ్చారు. ఒకవేళ ఎక్కువమంది వస్తే.. గ్రామానికి ఒకరు చొప్పున.. మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో ఒక్కొక్కరిని ఎంపిక చేస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు. తన పుట్టిన రోజున నిరుద్యోగులకు ఇస్తున్నఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది