Munugode Bypoll : లక్షా పదివేల ఓట్లు నాకే పడ్డాయి కేఏ పాల్ నెక్స్ట్ లెవెల్ కామెడీ..!!
Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికలలో రౌండ్ పెరిగే కొద్దీ ప్రధాన పార్టీల నాయకులలో బీపి పెరిగిపోతూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ చేస్తున్న కామెంట్లు కామెడీ పుట్టిస్తున్నాయి. ఏకంగా లక్ష పదివేల ఓట్లు ఈ ఉప ఎన్నికలలో తనకి పడినట్లు పాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు తనపై కుట్ర పన్నాయని ఆరోపించారు.
మునుగోడులో 2.25 లక్షల ఓట్లు ఉంటే 1.10 లక్షల ఓట్లు ఉన్న యువత తనకే ఓటేసినట్లు పేర్కొన్నారు. నలుగురు అబ్జర్వర్లు అభినందనలు కూడా తెలియజేశారని అన్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు 60 వేల ఓట్లు లెక్కిస్తే.. తనకు 600 ఓట్లు కూడా రాలేదని… ఈవీఎంలు టాపింగ్ అయ్యాయని .. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కేఏ పాల్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఉంగరం గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా కేఏ పాల్ పోటీ చేయడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో రైతు వేషధారణతో పాటు.. కటింగ్ షాపుల్లో … కటింగ్ చేయించుకునీ ఆయా వర్గాల ఓట్లు రాబట్టుకోవడం ఇంకా చెప్పులు కుట్టడం రకరకాల ఫీట్లు చేశారు. కొన్నిచోట్ల ప్రజలతో కలిసి డ్యాన్స్ కూడా వేయడం జరిగింది. సీరియస్ ఉపఎన్నికలలో కేఏ పాల్ వ్యవహరించిన తీరు కామెడీని తలపించింది. ఈ క్రమంలో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న కౌంటింగ్ లో తనకి లక్ష కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ లు కేఏ పాల్ నెక్స్ట్ లెవెల్ కామెడీ అని కౌంటర్ లు వేస్తున్నారు. అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీ కోసం ఆయన ముందుగానే అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ఈ రకమైన ఉత్కంఠ పోరులో కేఏ పాల్ హావభావాలతో ఎన్నికల ప్రక్రియలో చాలామందిని నవ్వించారు.