‘టీఆర్‌ఎస్‌’కు కడియం దెబ్బ.. ఆశలు పెట్టుకుంటున్న ఆ పార్టీలు

0
Advertisement

kadiyam srihari : వరంగల్ మరియు ఖమ్మం మున్సిపల్‌ కార్పోరేషన్‌ ల్లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ మరియు బీజేపీ లు హోరా హోరీగా తలపడబోతున్నాయి. హైదరాబాద్ లో దక్కించుకున్న విజయాలను కంటిన్యూ చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే టీఆర్‌ఎస్ మాత్రం మళ్లీ జీహెచ్‌ఎంసీ ఫలితాలను పునరావృతం కాకుండా చూడాలని గట్టి ప్రయత్నాలు చేసింది. వరంగల్ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు గట్టి దెబ్బ పడటం ఖాయం అనే నమ్మకంతో బీజేపీ ఉంది. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కడియం శ్రీహరి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. దాంతో ఆ దెబ్బ టీఆర్‌ఎస్ కు తప్పదని అంటున్నారు.

kadiyam srihari : ప్రచారంకు కడియం దూరం..

కడియ శ్రీహరి kadiyam srihari గత కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే మరియు ఒక మంత్రి చేస్తున్న డామినేషన్‌ ను ఆయన తట్టుకోలేక పోతున్నాడు. అందుకే టీఆర్‌ఎస్‌ కు మద్దతుగా ఎన్నికల్లో కడియం మరియు ఆయన వర్గీయులు ఎవరు కూడా ప్రచారం చేసింది లేదు. పార్టీ ముఖ్య నాయకులు అంతా కూడా అక్కడ ప్రచారానికి వెళ్తే అక్కడే ఉన్న కడియం మాత్రం ఏదో కారణం చెప్పి దూరంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. కడియం శ్రీహరికి వరంగల్‌ లో మంచి పట్టు ఉంది. అలాంటి కడియం ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల ఖచ్చితంగా టీఆర్‌ఎస్ కు నష్టం తప్పదని అంటున్నారు.

kadiyam srihari
kadiyam srihari

kadiyam srihari : బీజేపీకి మంచి రెస్పాన్స్‌..

టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సత్తా చాటుతుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాని బీజేపీ మాత్రం టీఆర్‌ఎస్ లో ఉన్న కుమ్ములాటల కారణంగా తమకు కలిసి వస్తుందని అంటున్నారు. వరంగల్‌ మున్సిపల్ కార్పోరేషన్‌ లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ మరియు బీజేపీ ముఖ్య నాయకులు భారీ ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ ప్రచారాలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు కడియం టీఆర్‌ఎస్ కు దూరంగా ఉండటం వల్ల ఫలితాలు కాషాయంకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement